Ali contesting MLA : ఈసారి రాజమండ్రి రాజకీయం మారబోతోంది. వైసీపీ నుంచి భరత్ ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ సినీనటుడు అలీకి ఎంపీ సీటు ఇవ్వనున్నట్లు సమాచారం. దీంతో రాజకీయం రసకందాయంలో పడనుంది. వైసీపీ ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్లనుంది. చాలా మంది ఎంపీలుగా పోటీ చేసిన వారు ఈసారి ఆ చాన్స్ తీసుకోవడానికి ఇష్టపడటం లేదు. ఎమ్మెల్యే స్థానం కోసమే పోటీ పడుతున్నారు.
రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చూస్తున్నట్లు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో నిడదవోలు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీలో ఉంటానని ప్రకటించారు. దీంతో రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి అలీకి టికెట్ ఇస్తారనే ప్రచారం సాగుతోంది. గత ఎన్నికల్లో రాజమండ్రి సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో విజయం సాధిస్తామని భరత్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
గత ఎన్నికల్లో రాజమండ్రి సిటీ, రూరల్ నియోజకవర్గాలను టీడీపీ గెలుచుకుంది. సిటీ నుంచి ఆదిరెడ్డి భవాని, రూరల్ నుంచి సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం సాధించారు. ఈసారి మాత్రం ఆ సీట్లు తామే కైవసం చేసుకుంటామని వైసీపీ నేతలు ప్రకటిస్తున్నారు. దీంతో రాజమండ్రి ఎంపీ సీటుపై అందరిలో అంచనాలు పెరుగుతున్నాయి.
మరోవైపు బీజేపీ నుంచి ప్రముఖ సినీనటి జయప్రదను రంగంలోకి దింపాలని అధిష్టానం ఆలోచిస్తోంది. రాజకీయాలకు ఎప్పుడు కూడా సినీ గ్లామర్ తోడవుతుంది. దీంతో జయప్రదను ఎంపీగా రంగంలోకి దింపాలని బీజేపీ నేతలు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాజమండ్రి ఎంపీ సీటుపై ప్రముఖుల కన్ను పడినట్లు చెబుతున్నారు.