Tirumala Alert : తిరుమలలో భక్తుల రద్దీ గత మూడు రోజులుగా కొనసాగుతోంది. ఉచిత సర్వ దర్శనానికి అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయి బయట క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తెలిపింది. టోకెన్లు లేని సర్వదర్శనానికి దాదాపు 16 గంటలకు పైగా సమయం పడుతోంది. రూ.300ల ప్రత్యేక దర్శనానికి 4 గంటల టైం పడుతోందని టీటీడీ వెల్లడించింది. మరోవైపు, టైం స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 12 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి దాదాపు 5 గంటల సమయం పడుతుంది.
ఆదివారం స్వామివారిని 86,721 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 39,559 మంది భక్తులు తమ తల నీలాలను సమర్పించుకొని మొక్కులు తీర్చుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.87 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు తెలిపారు. అలాగే, శనివారం 90 వేల మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అందులో 33,844 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకోగా.. స్వామివారి హుండీ ఆదాయం రూ. 3 కోట్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.