JAISW News Telugu

JEE : జేఈఈ అభ్యర్థులకు అలర్ట్.. రెండుసార్లు మాత్రమే పరీక్ష రాసుకోవచ్చు

JEE

JEE

JEE Exam : ఐఐటీల్లో బీటెక్, బీఆర్క్ సీట్ల భర్తీకి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్ డు (2025) నుంచి మూడుసార్లు రాసుకోవచ్చని ఇటీవల ప్రకటించిన నిర్ణయంపై జాయింట్ అడ్మిషన్ బోర్డు (జేఏబీ) యూటర్న్ తీసుకుంది. గతంలో మాదిరిగానే వరుసగా రెండుసార్లు మాత్రమే పరీక్షకు అనుమతి ఉంటుందని ఇటీవల (నవంబరు 15) జరిగిన జేఏబీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఐఐటీ కాన్పూర్ ప్రకటించింది. ఐఐటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి 2013 నుంచి జేఈఈ అడ్వాన్స్ డ్ పేరిట పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ఈ పరీక్షకు ఇంటర్ పాసైన సంవత్సరంతో పాటు ఆ తర్వాత ఏడాది, అంటే వరుసగా రెండుసార్లు మాత్రమే హాజరు కావొచ్చు. అయితే, ఈ అవకాశాన్ని మూడుసార్లకు పెంచుతూ జేఈఈ అడ్వాన్స్ డ్ నిర్వహణ బాధ్యత తీసుకున్న ఐఐటీ కాన్పూర్ నవంబరు 5న ప్రకటించింది. తాజాగా, 15 రోజులు కాకముందే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. దీంతో గతంలో మాదిరిగానే రెండుసార్లు మాత్రమే ఈ పరీక్ష రాసుకోవచ్చు. దీంతో 2025 మే నెలలో జరిగే అడ్వాన్స్ డ్ పరీక్షకు 2024 మార్చి, 2025 మార్చిలో జరిగే ఇంటర్ లేదా తత్సమానమైన పరీక్షలో పాసైనవారు మాత్రమే అర్హులు. అంతకంటే ముండు ఉత్తీర్ణులైనవారికి అవకాశం ఉండదు.

Exit mobile version