JAISW News Telugu

Alekhya Chitty : తమ మతంపై అలేఖ్య చిట్టీ సోదరి రమ్య సంచలన ప్రకటన

Alekhya Chitty Pickles : తాము పుట్టుకతో హిందువులమని, తమకు ఇతర మతాలతో ఎలాంటి సంబంధం లేదని ప్రముఖ నటి అలేఖ్య చిట్టి సోదరి రమ్య స్పష్టం చేశారు. ఒక వీడియో ద్వారా ఆమె ఈ విషయాన్ని తెలియజేస్తూ, తాను మరియు తన సోదరి శివుడిని ఎంతగానో ఆరాధిస్తామని చెప్పారు.

తమ తండ్రి కూడా అనాదిగా హిందువేనని, అయితే జీవితంలో ఎదురైన కష్టాల కారణంగా ఆయన క్రైస్తవ మతాన్ని స్వీకరించారని రమ్య తెలిపారు. కానీ తాము మాత్రం ఇంట్లో హిందూ సంప్రదాయాన్నే అనుసరిస్తున్నామని ఆమె నొక్కి చెప్పారు.

ఇటీవల తమ తండ్రి మరణించారని, ఆయన కోరిక మేరకు క్రైస్తవ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించామని రమ్య వి వివరించారు. అయితే, తాము మాత్రం హిందూ సంప్రదాయం ప్రకారం పిండ ప్రదాన కార్యక్రమాలు కూడా చేశామని ఆమె తెలిపారు.

ఈ వీడియో ద్వారా రమ్య తమ కుటుంబం యొక్క మతపరమైన నేపథ్యంపై వస్తున్న ట్రోల్స్, ఊహాగానాలకు తెర దించారు. తాము హిందువులమని, తమకు ఇతర మతాలతో ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు.

Exit mobile version