JAISW News Telugu

Alekhya Chitty : మా అక్క ని దూరంగా పెట్టాసాము అంటూ అలేఖ్య చిట్టీ సోదరి కామెంట్స్.. వైరల్!

Alekhya Chitty : ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ‘అలేఖ్య చిట్టి పికిల్స్’ వివాదం తర్వాత ఆ వ్యాపారం పూర్తిగా మూతపడింది. అనుచిత ఆడియోల కారణంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న తర్వాత అలేఖ్య హాస్పిటల్ చేరడం, అక్కాచెల్లెళ్ల క్షమాపణలు – ఇవన్నీ పెద్ద దుమారానికే కారణమయ్యాయి.తాజాగా రమ్య విడుదల చేసిన వీడియోలో, “ఇకపై అలేఖ్య పికిల్స్ ఉండదు. త్వరలోనే ‘రమ్య మోక్ష పికిల్స్’ పేరుతో కొత్త వ్యాపారం మొదలవుతుంది. ఇందులో అలేఖ్య భాగస్వామి ఉండదు. నేను, నా చెల్లి మాత్రమే కలసి ముందుకు వెళ్తాము. ఈసారి అన్ని లైసెన్స్ లతో, న్యాయబద్ధంగా వ్యాపారం కొనసాగిస్తాము. కస్టమర్స్ తో ప్రొఫెషనల్‌గా వ్యవహరించేందుకు ప్రత్యేకంగా ఓ వ్యక్తిని నియమిస్తాం” అని పేర్కొన్నారు.వివాదాల నుంచి బయటపడి తిరిగి సక్సెస్ అవ్వాలని రమ్య ఆశపడుతున్నారు. ‘రమ్య మోక్ష పికిల్స్’కు ప్రజల మద్దతు దక్కుతుందేమో చూడాలి.

Exit mobile version