Alekhya Chitti : అలేఖ్య చిట్టి ‘బిగ్ బాస్ 9’ రూమర్స్‌పై క్లారిటీ – సోదరి సుమీ స్పందన

Alekhya Chitti : పికిల్స్ వ్యాపారం ద్వారా ఫేమస్ అయిన అలేఖ్య చిట్టి, ఇటీవల వివాదాల్లో చిక్కుకుంది. ఓ కస్టమర్‌ను దూషించిన వీడియో వైరల్ కావడంతో ట్రోలింగ్ మొదలైంది, ఆరోగ్యం క్షీణించి ICU వరకు వెళ్లింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉంది.ఈ క్రమంలో ‘బిగ్ బాస్ 9 తెలుగు’కి అలేఖ్య సిస్టర్స్‌లో ఒకరు ఎంపికయ్యారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై సోదరి సుమీ స్పందిస్తూ – “బిగ్ బాస్ టీం నుంచి ఎలాంటి ఆఫర్ రాలేదు. ఈ వార్తలు నిజం కావు” అని స్పష్టం చేసింది. ఇక “తన భర్త వదిలేశాడు” అన్న ప్రచారాన్ని కూడా ఖండించిన సుమీ – “నా భర్త ఇప్పటికీ నన్ను పూర్తిగా నమ్ముతూనే ఉన్నాడు. దయచేసి ఇలాంటి అపవాదులు వ్యాపించవద్దు” అని కోరింది. ఇకపై వివాదాలపై స్పందించడం మానేస్తానని, యూట్యూబ్ ద్వారా వృత్తిపరమైన కంటెంట్‌పై దృష్టి పెడతానని తెలిపారు.

TAGS