Abhishek Sharma : అయ్యో అభిషేక్ శర్మ ఆ పరుగు తీస్తే అయిపోయేదిగా
Abhishek Sharma : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టి20 సిరీస్ లో భారత్ సెంచురియన్ లో జరిగిన మూడో మ్యాచ్లో విజయం సాధించింది. కాగా ఫామ్ లేని తో ఇబ్బంది పడుతున్న ఓపెనర్ అభిషేక్ శర్మ 25 బంతుల్లో 50 పరుగులు చేసి ఫామ్ అందుకున్నాడు. గత రెండు మ్యాచ్ల్లో కేవలం 7, 4 పరుగులకు అవుట్ అయిన అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లో 25 బంతులు ఎదుర్కొని 50 పరుగులు చేశాడు.అందులో మూడు ఫోర్లు, ఐదు సిక్సులు ఉండటం గమనార్హం. అభిషేక్ శర్మ జింబాబ్వే తో టి20 క్రికెట్ కెరీర్ ను ప్రారంభించాడు. కాగా మొదటి మ్యాచ్ లోనే డకౌట్ అయి వెనుదిరిగాడు. అనంతరం రెండో మ్యాచ్ లో సెంచరీ తో కదం తొక్కాడు.
అభిషేక్ శర్మ సత్తా ఉన్న క్రికెటర్. యువరాజ్ సింగ్ పర్యవేక్షణలో ప్రత్యేకమైన కోచింగ్ తీసుకున్నాడు. భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అనగానే క్రికెట్ అభిమానులకు అందరికీ తెలిసిన విషయమే. అయితే అభిషేక్ శర్మ కంటిన్యూగా రాణించలేకపోవడం ఇక్కడ ఆందోళన కలిగించే విషయం.
మూడో టి20 మ్యాచ్లో తిలక్ వర్మ కేశవ మహారాజు బౌలింగ్ లో..
షాట్ కొట్టి రెండు పరుగులు తీయడానికి ప్రయత్నం చేశాడు. కానీ అభిషేక్ శర్మ రెండో పరుగుకు స్పందించలేడు. దీంతో స్ట్రైకింగ్ లో అభిషేక్ శర్మ ఉన్నాడు. కేశవ్ మహారాజ్ బౌలింగ్ చేయగా ముందుకొచ్చి సిక్స్ కొట్టడానికి ప్రయత్నించిన అభిషేక్ శర్మ స్టంప్ అవుట్ గా వెనుతిరిగాడు.
దీంతో అభిషేక్ శర్మ ను తిలక్ వర్మ చెప్పినట్టు రెండో పరుగు చేసి ఉంటే నాటౌట్ అయి ఉండేవాడివని ఎందుకు అలా చేశావని ప్రశ్నిస్తున్నారు. కాస్త వెసులుబాటు చేసుకుని ఆడితే బాగుంటుందని మరో పెద్ద ఇన్నింగ్స్ గా మలిచే అవకాశం ఉండేదని అంటున్నారు. మొత్తం మీద అభిషేక్ శర్మ ఫామ్ లోకి రావడం శుభ పరిణామం.