Akshay Kumar : కొవిడ్ తర్వాత అక్షయ్ కుమార్ వరుస డిజాస్టర్లతో సతమతం అవుతున్నాడు. హిట్లు కావడం సంగతి అటుంచితే ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మినిమం ఓపెనింగ్స్ కూడా రాబట్టలేక పోతున్నాయి. ఇప్పుడు ఆశలన్నీ టైగర్ ష్రాఫ్ నటించిన యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ‘బడే మియాన్ ఛోటే మియాన్’పై పెట్టుకున్నాడు. ఏప్రిల్ 5వ తేదీ బిగ్ ఈద్ సందర్భంగా బీఎంసీఎంలో ఈ మూవీ విడుదల కానుంది.
టైగర్ జిందా హై, సుల్తాన్ వంటి సినిమాలతో మంచి ట్రాక్ రికార్డ్ సంపాదించుకున్న అలీ అబ్బాస్ జాఫర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హై బడ్జెట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లోని లొకేషన్స్ లో చిత్రీకరించారు. సలార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.
అదే రోజు ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా కూడా విడుదలవుతోంది. తమ సినిమాకు దేవరతో ముప్పు పొంచి ఉందని బీఎంసీఎం నిర్మాతలు భావించారు. అయితే నిన్న దేవర ఫస్ట్ గ్లింప్స్ రిలీజైన తర్వాత బీఎంసీఎం టీమ్ పానిక్ ప్రెస్ చేసింది.
హై క్లాస్ టెక్నికల్ వాల్యూస్, అద్భుతమైన విజువల్స్ తో పాన్ ఇండియా లెవల్ లో కూడా దేవర గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుంది. నార్త్ ఆడియన్స్ విషయానికొస్తే ఎన్టీఆర్ హిందీ మాండలికం కూడా మరో యూఎస్పీ. ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ ఈ వెంట్ తర్వాత ఎన్టీఆర్ వస్తుండడంతో అంచనాలు మరింత పెరిగాయి. గ్లింప్స్ తర్వాత దేవర హిందీలో కూడా మంచి బిజినెస్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ప్రభాస్ సలార్ హిందీ బెల్ట్ లో షారుఖ్ నటించిన డుంకీని ఎలా ప్రభావితం చేసిందో మనం ఇటీవల చూశాం. బడే మియాన్ ఛోటే మియాన్ నిర్మాతలు ఇప్పుడు దేవరతో ఢీ కొనే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. టాలీవుడ్ ఇండస్ట్రీనా మజాకా.. బాలీవుడ్ ను సైతం ముప్పు తిప్పలు పెడుతుంది.