JAISW News Telugu

Akshay Kumar : 1000 కోట్ల క్లబ్ లో చేరిన అక్షయ్ కుమార్.. లాభాలు అనుకుంటే పొరపాటే..! 

Akshay Kumar

Akshay Kumar

Akshay Kumar : కరోనా తర్వాతి కాలంలో అక్షయ్ కుమార్ తన 13వ డిజాస్టర్ ను విజయవంతంగా అందించాడు. ఒకప్పుడు హిట్ మిషిన్ గా గుర్తింపు దక్కించుకున్న అక్షయ్ ఇప్పుడు డిజాస్టర్ మిషిన్ గా మారిపోయారు. తనను తప్ప మరెవరినీ నిందించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

కేవలం 100 కోట్ల రెమ్యునరేషన్ కోసం లెఫ్ట్, రైట్, సెంటర్ సినిమాలకు సైన్ చేయడం నటనపై దృష్టి పెట్టకపోవడం, సినిమాలను అర్ధాంతరంగా పూర్తిచేయడం, నటనపై ఏమాత్రం అభిరుచి, అంకితభావం లేకపోవడం, రాజకీయ పార్టీతో అనుబంధం పెంచుకోవడం, అభిమానుల భావోద్వేగాలు, అంచనాలను గౌరవించకపోవడం వంటివి ఆయనను ఈ స్థితిలోకి నెట్టివేశాయి.

ఆయన డిజాస్టర్ జిబితా పరిశీలిస్తే బెల్ బాటమ్, లక్ష్మీ, కట్ట్ పుట్లీ, అత్రంగి రే, బచ్చన్ పాండే, సామ్రాట్ పృథ్వీరాజ్, రక్షా బంధన్, రామ్ సేతు, సెల్ఫీ, మిషన్ రాణిగంజ్, బడే మియాన్ చోటే మియాన్ ఉండగా అందులోకి లెటెస్ట్ గా ‘సర్ఫిరా’ కూడా వచ్చి చేరింది.

ఈ సినిమాల నష్టాలు దాదాపు రూ. 1000 కోట్ల మార్కును దాటేశాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటిలో బడే మియాన్ ఛోటే మియాన్ ఒక్క సినిమానే 250 కోట్ల నష్టాన్ని మిగిల్చింది. సామ్రాట్ పృథ్వీరాజ్ నిర్మాతలు దాదాపు 150 కోట్ల నష్టాలను చవిచూశారు.

దేశంలోని ఇతర తారలు బాక్సాఫీస్ వద్ద 1000 కోట్లు కలెక్ట్ చేసే సినిమా తీయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే.. ఇక్కడ అక్షయ్ కుమార్ ముందుకు వెళ్లి 1000 కోట్లకు పైగా నష్టాలను తీసుకువచ్చాడు. పైగా ఆ పరంపర కొనసాగిస్తున్నాడు. అంత పెద్ద స్టార్ హీరోకు ఇది అతి మంచిది కాదని ట్రేడ్ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కో ఆర్టిస్టులు చెప్పినా.. ఫ్యాన్స్ చెప్పినా పట్టించుకోకపోవడంతోనే ఇలాంటి సినిమాలతో చేతులు కాల్చుకుంటున్నారని అంటున్నారు.

Exit mobile version