JAISW News Telugu

Akshar Patel : అశ్విన్ స్థానంలో అక్షర్ పటేల్.. సాధ్యమా? ఐసీసీ  రూల్స్ ఏం చెబుతున్నాయి?

Akshar Patel

Akshar Patel

Akshar Patel : ఇంగ్లాండ్ తో రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ నుంచి టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా తప్పుకున్నాడు. అతడి తల్లి అనారోగ్యంతో బాధపడుతుండడంతో అశ్విన్ జట్టును వీడి చెన్నై వెళ్లాడు. ఈ విషయాన్ని బీసీసీఐ సైతం ధ్రువీకరించింది. ఈ కఠిన కాలంలో అశ్విన్ కు అండగా ఉంటామని, అతడి వ్యక్తిగత గోప్యతకు గౌరవం ఇవ్వాలని మీడియా, అభిమానులకు సూచించింది.

అయితే అశ్విన్ గైర్హాజరీ టీమిండియాకు సమస్యగా మారనుంది. అశ్విన్ వెళ్లిపోవడంతో టీమిండియా నలుగురు బౌలర్లతోనే బౌలింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 10 మంది ప్లేయర్లు, ఓ సబ్ స్టిట్యూట్ ఫీల్డర్ లో మూడో రోజు ఆటను కొనసాగించాల్సి ఉంటుంది. అయితే కంకషన్ రూల్ లా అశ్విన్ లా అశ్విన్ స్థానంలో అక్షర్ పటేల్ లేదా వాషింగ్టన్ సుందర్ ను ఆడించవచ్చా? అంటే రూల్స్ ప్రకారం బరిలోకి దింపవచ్చనే సమాధానం వినిపిస్తోంది.

అయితే ఇందుకు ప్రత్యర్థి కెప్టెన్ బెన్ స్టోక్స్ అంగీకరించాల్సి ఉంటుంది. ఐసీసీ నిబంధనల ప్రకారం ప్రత్యేక పరిస్థితుల్లో ప్లేయర్ రిప్లేస్ మెంట్ చేయవచ్చు. ఈ రూల్స్ ను ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ప్రముఖ జర్నలిస్ట్ విక్రాంత్ గుప్తా సైతం ప్లేయర్ రిప్లేస్ మెంట్  చేయవచ్చని తెలిపాడు.

‘బెన్ స్టోక్స్, ఇంగ్లాండ్ మేనేజ్ మెంట్ మానవతా దృక్పథంతో ప్లేయర్ రిప్లేస్ మెంట్ కు అంగీకరిస్తే అశ్విన్ స్థానంలో మరో ప్లేయర్ ను బరిలోకి దించవచ్చు. లేకపోతే సబ్ స్టిట్యూట్ ప్లేయర్ తో ఆడాల్సి ఉంటుంది. బెన్ స్టోక్స్.. రిప్లేస్ మెంట్ కు అంగీకరిస్తే నేనేం ఆశ్చర్యపోను’’ అని విక్రాంత్ గుప్తా ట్వీట్ చేశారు.

‘‘ప్రత్యర్థి కెప్టెన్ అంగీకరిస్తే రిప్లేస్ మెంట్ ప్లేయర్ బరిలోకి దిగవచ్చు. అయితే ఒరిజిన్ ప్లేయర్ అప్పటికే బ్యాటింగ్ చేసి ఉంటే మాత్రం రిప్లేస్ మెంట్ ప్లేయర్ మళ్లీ బ్యాటింగ్ చేయకూడదు. బౌలింగ్ కు మాత్రం అనుమతి ఉంటుంది..’’ అని ఇందుకు సంబంధించిన రూల్స్ ను హర్షా భోగ్లే ఎక్స్ వేదికగా పంచుకున్నారు.

ప్లేయర్ రిప్లేస్ మెంట్ కు సంబంధించి ఐసీసీ రూల్స్ ఇవి..

– ఇరు జట్ల కెప్టెన్లు టాస్ కు ముందే రిప్లేస్ మెంట్ ఆటగాళ్ల వివరాలను అంపైర్లకు తెలియజేయాలి.
– ప్రత్యర్థి కెప్టెన్ అంగీకారం లేకుండా ఆటగాడి రిప్లేస్ మెంట్ సాధ్యం కాదు.
– రిప్లేస్ మెంట్ ఆటగాళ్లు ఒరిజినల్ ప్లేయర్ కు ప్రత్యామ్నాయంగా మాత్రమే ఉండాలి.
-ఒరిజినల్ బ్యాటర్ బ్యాటింగ్ చేసి ఉంటే.. రిప్లేస్ మెంట్ ప్లేయర్ బ్యాటింగ్ చేయడానికి వీలు లేదు.

ఈ రూల్స్ ప్రకారం రిప్లేస్ మెంట్ కు బెన్ స్టోక్స్ అంగీకరిస్తే.. అక్షర్ పటేల్ లేదా వాషింగ్టన్ సుందర్ బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే టాస్ సమయంలో ఈ ఇద్దిరి పేర్లను టీమిండియా నామినేట్ చేస్తేనే అవకాశం ఉంటుంది. బెంచ్ ఆటగాళ్లుగా సుందర్, అక్షర్ తో పాటు ఆకాశ్ దీప్ , శ్రీకర్ భరత్ , దేవదత్ పడిక్కల్ కొనసాగుతున్నారు.

Exit mobile version