Akkineni Nagarjuna : వరుస ఫ్లాపులతో డీలాపడిన అక్కినేని నాగార్జున రీసెంట్ గా ‘నా సామి రంగ’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని తన కం బ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విజయం పట్ల అక్కినేని అభిమానుల ఆనందానికి అవధులే లేకుండా పోయాయి. నాగార్జున కమర్షియల్ సినిమాలు చేస్తే కథ వేరే లాగ ఉంటుంది అనడానికి ఈ సినిమా మరో ఉదాహరణగా నిల్చింది.
సుమారుగా 20 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా ఇప్పటికీ థియేటర్స్ లో విజయవంతం గా రన్ అవుతుంది. ఈ సినిమా తర్వాత నాగార్జున మళ్ళీ అభిమానులు గర్వపడే సినిమా చేస్తున్నాడు అనే చెప్పాలి. శేఖర్ కమ్ముల దర్శకత్వం లో ఆయన తన తదుపరి చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం లో ధనుష్ కూడా మరో హీరో గా నటిస్తున్నాడట. రీసెంట్ గానే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.
ముందుగా నాగార్జున పై చంచల్ గూడా జైలులో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు డైరెక్టర్ శేఖర్ కమ్ముల. రెండు రోజుల పాటు ఈ జైలులో చిత్రీకరణ ఉంటుందట. ఇందులో నాగార్జున క్యారక్టర్ చాలా పవర్ ఫుల్ గా, ఇప్పటి వరకు అభిమానులు చూడని విధంగా ఉండబోతుంది అట. ధనుష్ కి ఇది తెలుగులో రెండవ సినిమా. ఇంతకు ముందు ఆయన ‘సార్’ చిత్రం తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత మళ్ళీ ఆయన తెలుగు లో చేస్తున్న చిత్రం ఇదే. ఈ చిత్రం లో హీరోయిన్ గా రష్మిక మందన నటిస్తుంది. శరవేగంగా షూటింగ్ కర్తక్రమాలు పూర్తి చేసి, వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.
ఈ సినిమాకి సునీల్ నారంగ్ మరియు రామ్ మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. గతం లోనే నాగార్జున – ధనుష్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. సార్ సినిమా హిట్ తర్వాత ధనుష్ కి వరుసగా రెండు ఫ్లాప్ సినిమాలు వచ్చాయి. ఈ సినిమాల తర్వాత ఆయనకి మళ్ళీ టాలీవుడ్ లోనే హిట్ తగిలేట్టు ఉంది. చూస్తూ ఉంటే ధనుష్ ఇక నుండి తమిళం లో కంటే తెలుగులోనే ఎక్కువగా సినిమాలు చేసేట్టు ఉన్నాడు.