Akkineni Akhil : ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి 8 ఏళ్ళు పూర్తి అయ్యింది. అక్కినేని ఫ్యామిలీ గర్వపడే రేంజ్ కి ఎదుగుతాడని అభిమానులు ఎంతో ఆశపడితే కనీసం ఇప్పటి వరకు ఒక్క హిట్ ని కూడా అందించలేకపోయాడు అక్కినేని అఖిల్. రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన ‘ఏజెంట్’ చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది.
ఈ సినిమా మీద అక్కినేని ఫ్యాన్స్ అప్పట్లో పంచ ప్రాణాలే పెట్టుకున్నారు. ఫుల్ రన్ లో వంద కోట్ల రూపాయిల షేర్ ని కొల్లగొడుతుంది అనుకుంటే కనీసం 7 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది. దీనిని బట్టీ ఈ చిత్రం ఏ రేంజ్ డిజాస్టర్ ఫ్లాప్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సినిమా తర్వాత అఖిల్ ఏ చిత్రం చెయ్యబోతున్నాడు అని అభిమానుల్లో చాలా వరకు అంతర్మధనం నడిచింది.
యువీ క్రియేషన్స్ బ్యానర్ లో ఆయన ‘యోధా’ అనే చిత్రం చెయ్యబోతున్నాడు. సుమారుగా వంద కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రం మీద నమ్మకాలు పెట్టుకోవాలంటే భయపడిపోతున్నారు అక్కినేని ఫ్యాన్స్. ఎందుకంటే ‘ఏజెంట్’ చిత్రం అందించిన అనుభవాలు అలాంటివి. ఇలాంటి నిరుత్సాహ సమయం లో అక్కినేని ఫ్యాన్స్ కి కొండంత ధైర్యం ఇచ్చే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియా లో ప్రచారం అవుతుంది.
అదేమిటంటే, త్వరలోనే ఆయన ప్రముఖ పాన్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు అని టాక్. ఈ సినిమాకి సంబంధించిన కథా చర్చలు కూడా రీసెంట్ గానే ముగిసిందట. కేజీఎఫ్ సిరీస్, సలార్ వంటి సినిమాలను నిర్మించిన హోమబుల్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్టు సమాచారం. ఇటీవలే అఖిల్ బెంగళూరు లో సలార్ మూవీ యూనిట్ చేసుకున్న సక్సెస్ మీట్ లో పాల్గొనడానికి కారణం ఇదే అని అంటున్నారు.
ఈ ఏడాది చివరి లోపు ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉందని సోషల్ మీడియా లో వినిపిస్తున్న వార్త. అదే కనుక నిజమైతే కచ్చితంగా అక్కినేని ఫ్యాన్స్ అఖిల్ నుండి ఆశించిన సక్సెస్ వచ్చేస్తుంది అనే చెప్పొచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అతి త్వరలోనే తెలియచేయనున్నారట. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఫోకస్ ‘సలార్ 2 ‘ మీదనే ఉంది. ఈ సినిమా ఏప్రిల్ నుండి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.