Bollywood Heroine : అక్క బాలీవుడ్ టాప్ హీరోయిన్.. జాబ్ అడిగితే ఇప్పించలేకపోయింది..

Bollywood Heroine

Bollywood Heroine Parineeti Chopra

Bollywood heroine Parineeti Chopra : బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా బాడీ షేమింగ్ ను ఎదుర్కొని హీరోయిన్ గా ఎదిగింది. ఆమె సోదరి అప్పటికే స్టార్ హీరోయిన్. ఆమె మరెవరో కాదు. ప్రియాంక చోప్రా. ప్రియాంక, పరిణీతి ఇద్దరూ అక్కాచెల్లెళ్లు.  పరిణీతి చోప్రా అక్టోబరు 22, 1988న హర్యానాలోని ఓ పంజాబీ కుటుంబంలో జన్మించింది.  తండ్రి వ్యాపారవేత్త. ఆర్మీకి వస్తువులు సరఫరా చేస్తుంటాడు. పరిణీతి ఉన్నత విద్యావంతురాలు. శాస్త్రీయ సంగీతంలో ప్రావీణ్య ఉంది. 2009లో చదువు పూర్తి చేసుకుంది.  అప్పటికీ పరిణీతికి సినిమాల్లోకి రావాలన్న ఆసక్తి లేకపోవడంతో యూకే వెళ్లేందుకు ఫిక్స్ అయ్యింది.

తండ్రి డబ్బు సర్దుబాటు చేయడంతో యూకే వెళ్లింది కానీ అప్పటికే మాంద్యం కారణంగా సాఫ్ట్ వేర్ రంగం కుదేలు కావడంతో ఇండియాకు తిరిగి రాక తప్పని పరిస్థితి. ఈ క్లిష్ట సమయంలో తన అక్క ప్రియాంక చోప్రాకు తన బాద చెప్పుకుంది. వీసా టైమ్ గడువు ముగిసిందని, తనకో జాబ్ ఇప్పించమని కోరింది. పరిణీతి ముంబై వచ్చే సమయానికి ప్రియాకం బాలీవుడ్ లో టాప్ వన్ హీరోయిన్.  కానీ పరిణీతి జాబ్ విషయాన్ని ప్రియాంక పట్టించుకోలేదు. ఓ రోజు ప్రియాంక షూటింగ్ చేస్తున్న లోకేషన్ కు వెళ్లింది పరిణీతి.

యష్ రాజ్ ఫిల్మ్స్‌లో జాబ్ ..

పరిణీతి తనే స్వయంగా  యష్ రాజ్ ఫిల్మ్స్ వారిని సంప్రదించింది. ఆ ప్రొడక్షన్ హౌస్ లో మేనేజర్‌గా పనిచేసింది. ‘దిల్ బోలే హడిప్పా’, ‘రాకెట్ సింగ్’, ‘బద్మాష్ కంపెనీ’, ‘లఫాంగీ పరిందే’ ‘బ్యాండ్ బాజా బారాత్’ వంటి సూపరట్ హిట్ సినిమాల నిర్వహణ బాధ్యతలు చూసకుంది.  ఇక అదే సమయంలో పరిణీతి ‘లేడీస్ వర్సెస్ రికీ బహల్’ సినిమాతో నటిగా ప్రవేశం చేసింది. ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. దీని తర్వాత, అర్జున్ కపూర్‌తో తదుపరి చిత్రం ‘ఇషాక్‌జాదే’లో పరిణీతి హీరోయిన్‌గా కనిపించింది.

‘ఇషాక్‌జాదే’ సక్సెస్‌ఫుల్‌, డిఫరెంట్‌ కమర్షియల్‌ చిత్రాల తర్వాత పరిణీతి చేతిలో చాలా మంచి సినిమాలు వచ్చాయి. ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’ (2013)  ‘హసీ తో ఫేసీ’ (2014) చిత్రాలతో మరింత పేరు తెచ్చుకుంది. అయితే సానియా మీర్జా జీవిత చరిత్రపై సినిమా తీస్తే,  ఆమె బయోపిక్ లో నటించాలని ఉందని చెప్పింది.

TAGS