Akhilesh Yadav : జగన్ ను కలిసిన అఖిలేష్ యాదవ్.. అందులో భాగంగానేనా ?

Akhilesh Yadav

Akhilesh Yadav

Akhilesh Yadav : దేశంలో రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్ గానే ఉంటాయి. ఇక్కడ ప్రతిరోజూ ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. దీని కారణంగా రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. బుధవారం మరోసారి రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. ఢిల్లీలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన నిరసన కార్యక్రమంలో అఖిలేష్‌ యాదవ్‌ పాల్గొనడమే కలకలంకు కారణమైంది. బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో పాటు సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా నిరసన తెలిపారు. దీని తర్వాత అఖిలేష్ యాదవ్ కూడా ఓ పోస్ట్ చేశారు. అఖిలేష్ నిరసనకు దిగిన వెంటనే ఢిల్లీ నుంచి యూపీ వరకు రాజకీయ వాతావరణం నెలకొంది.

ఇదివరకు జగన్‌ సీఎంగా ఉన్నప్పుడు ఢిల్లీకి వెళ్లి మోడీ, అమిత్ షాలతో భేటీ అయినప్పుడు అప్పులు, కేసుల కోసమే తిరుగుతున్నారని పలువురు పేర్కొనేవారు.  అది నిజమేనని ఓ బీజేపీ నేత కూడా చెప్పారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికారం కోల్పోయి జగన్‌ జస్ట్ ఎమ్మెల్యేగా మిగిలిపోయారు. అయినా కూడా జగన్‌ ఢిల్లీలో ధర్నా చేస్తుంటే గిట్టనివాళ్ళు విమర్శలు చేయడం  మొదలుపెట్టారు. పాత కేసులలో ఉపశమనంతో పాటు కొత్త కేసుల నుంచి రక్షించుకునేందుకే మోడీ, అమిత్ షాలను కలిసే నేపథ్యంలోనే ఢిల్లీలో ధర్నా పెట్టుకున్నారని లేకుంటే శాసనసభ ఎదుట లేదా తన విశాఖ రాజధానిలోనో ధర్నా చేసుకునే వారే అంటున్నారు. కానీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలవుతుంటే ఢిల్లీలో ధర్నా అవసరమా? అంటే అత్యవసరమే అని మరికొందరు అంటున్నారు. అయితే జగన్‌ చెబుతున్న కారణాల కోసం మాత్రం కాదంటున్నారు.

ప్రస్తుతం ఎన్డీయేలో చంద్రబాబు కీలకంగా ఉన్నారు. కనుక మోడీ, అమిత్ షాలు జగన్‌కి ‘రక్షణ కవచం’ ఆఫర్ చేయకపోవచ్చని, కనుక కాంగ్రెస్‌తో టచ్‌లోకి వెళ్లేందుకు జగన్ ట్రై చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.  కాంగ్రెస్‌ చేయి అందిస్తే ముందుగా పక్కలో బల్లెంగా మారిన చెల్లి షర్మిలని వదిలించుకోవచ్చు. ఆ తర్వాత కాంగ్రెస్‌ కవచం ఎలాగూ లభిస్తుందని జగన్‌కు కేసీఆర్‌ చెప్పి ఉంటారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయనే తన శిష్యుడు అఖిలేష్ కుమార్‌ యాదవ్‌ని ఢిల్లీలో ధర్నా చేస్తున్న జగన్‌ వద్దకు పంపించి ఉండవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అఖిలేష్ కుమార్‌ ఇండియా కూటమి భాగస్వామి అన్న విషయం తెలిసిందే. కనుక ఆయన సోనియా, రాహుల్ గాంధీలతో రాయబారం జరిపి కాంగ్రెస్‌లో వైసీపి విలీనానికి ఒప్పించవచ్చని ఆ గుసగుసల సారాంశం. కాంగ్రెస్‌తో రాయబారం కోసమే దాంతో మంచి పరిచయాలున్న బొత్స సత్యనారాయణని వెంటబెట్టుకొని జగన్‌ ఢిల్లీ వెళ్ళారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కనుక బొత్స సత్యనారాయణ లేదా అఖిలేష్ యాదవ్‌ ఇద్దరిలో ఎవరో ఒకరు కాంగ్రెస్‌తో జగన్‌కు తప్పక సెట్ చేస్తారని టాక్ వినిపిస్తోంది.

TAGS