Telangana Election Result:తెలంగాణ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. ఈ లెక్కింపులో కరీంనగర్ భాజాపా లీడర్ బండి సంజయ్ ముందంజలో ఉండగా కాంగ్రెస్ అభ్యర్థులు 27 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక చాంద్రాయణగుట్టలో ఎంఐఎమ్ అభ్యర్థి అక్బరుద్దీన్ ఓవైసీ ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే వరుసగా చాంద్రయణగుట్ట నియోజక వర్గంలో ఐదు సార్లు గెలిచి ఆరవ సారి కూడా విక్టరీ సాధించబోతున్నారని సంకేతాలు అందుతున్నాయి.
ఇదే జరిగితే చాంద్రాయణగుట్ట నియోజక వర్గంలో అక్బరుద్దీన్ ఓవైసీ డబుల్ హ్యాట్రిక్ సాధించడం ఖాయం అని చెబుతున్నారు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్‌గా మారడంతో పర్వత్రా అక్బరుద్దీన్ ఓవైసీ ఫలితంపై అందరిలోనూ ఆసక్తి మొదలైంది. గత ఎన్నికల పమయంలో అక్బరుద్దీన్ ఓవైసీ 95,339 ఓట్లు రాబట్టి బీజేపీ అభ్యర్థి సయ్యద్ షహజాదీపై 80,264 ఓట్లు సాధించారు.
ద్వితీయ స్థానంలో సయ్యద్ షహజాదీ 15, 075 ఓట్లు, తర్వాత స్థానాలలో బీఆర్ ఎస్ అభ్యర్థి ముప్పిడి సీతారామ్ రెడ్డి 14,224, కాంగ్రెస్ అభ్యర్థి ఇసా బిన్ ఓబేద్ మిశ్రీ 11,309 ఓట్లు మాత్రమే రాబట్ట గలిగారు. గతంతో పోలిస్తే ఈసారి 12 వేల ఓట్లు అధికంగా పోలవ్వడం, ప్రధాన పార్టీల అభ్యర్థులు హిందువులు కావడంతో ముస్లీం ఓట్లు తమకు గంప గుత్తగా పడి లక్ష మెజారిటీ వస్తుందని మజ్లస్ పార్టీ అంచనా వేసుకుంటోంది. మరి వారి అంచనాలు ఎంత వరకు నిజమవుతాయి? అనుకున్నట్టే అక్బరుద్దీన్ ఓవైసీ డబుల్ హ్యాట్రిక్‌ని సాధిస్తారా? అన్నది మరి కొన్ని గంటల్లో తేలబోతోంది.