Akai Meaning : ‘అకాయ్’ అర్థం ఇదే.. విరాట్, అనుష్క పరాయి భాషలో పేరు ఎందుకు పెట్టారంటే..

Akai Meaning

Akai Meaning

Akai Meaning : భారత్ లో మోస్ట్ పాపులర్ సెలబ్రిటీ జంట విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ. విరాట్ క్రికెట్ రారాజు. అనుష్క బాలీవుడ్ ముద్దుగుమ్మ కావడంతో ఈ జంట ఏం చేసినా మీడియాలో ఫుల్ కవరేజీ ఇస్తుంది. అదంతా ఎందుకు విరాట్ కోహ్లీ ఏదైనా సోషల్ మీడియాలో చిన్న ట్వీట్ చేసిన కోట్ల వర్షం కురుస్తుంది. దీన్నే బట్టే తెలుస్తుంది కోహ్లీకి ఎంత క్రేజ్ ఉందో. క్రేజ్ వరకు బాగానే ఉంది కానీ ఇదే వారి ప్రైవసీకి అడ్డు వస్తోంది.

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క డెలివరీ గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అందుకే విరాట్ టెస్ట్ మ్యాచ్ లు ఆడడం లేదని కూడా వార్తలు వచ్చాయి. అయితే దీనిపై విరాట్ కానీ, బీసీసీఐ కానీ స్పందించలేదు. తాజాగా విరాట్, అనుష్క   తాము రెండో సారి తల్లిదండ్రులైనట్టు  ప్రకటించారు.

అనుష్క తన ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్స్ లో ఫిబ్రవరి 15న  పండంటి మగబిడ్డ పుట్టాడని ఓ గ్రీటింగ్ కార్డు షేర్ చేశారు. ఆ బాబుకు అకాయ్ అని పేరు పెట్టినట్టు సైతం చెప్పారు. అయితే బాబు ఫొటో మాత్రం పోస్ట్ చేయలేదు. ‘‘సముద్రమంతా ఆనందంతో, ఆనంద హృదయాలతో ఫిబ్రవరి 15న మా అబ్బాయి అకాయ్ ను మా ఈ ప్రపంచంలోకి ఆహ్వానించామని..వామికా కూడా తన తమ్ముడికి వెల్ కమ్ చెప్పిందంటూ పోస్ట్ చేశారు. ఈ టైమ్ లో అందరి ఆశీర్వాదాలు కావాలంటూ తమ ప్రైవసీని గౌరవించాలని కోరుకుంటూ పోస్ట్ చేశారు.

ఇక తమ బిడ్డకు అకాయ్ అని పేరు పెట్టినట్టు చెప్పారు. అకాయ్ అనేది టర్కిష్ పదం. టర్కిష్ లో అకాయ్ అంటే మెరిసే చంద్రుడు. దేదీప్యమానంగా వెలిగే చంద్రుడని అర్థం. వారి కూతురు వామిక అంటే సంస్కృత భాషలో దుర్గామాత అని అర్థం. ఇలా టర్కిష్ భాషలో పేరు పెట్టడంతో ఈ పేరుకు అర్థం వెతికే పనిలో పడ్డారు జనాలంతా. అయితే ఆ పేరుకు ఒక్కో భాషలో ఒక్కో అర్థం ఉంది. హిందీలో అకాయ్ అనే పేరుకు శరీరం లేకుండా అనే అర్థం వస్తోంది. అయితే టర్కిష్ భాషలో అర్థం బాగుండడంతో దాని ఆధారంగానే ఈ పేరు పెట్టారని అంటున్నారు. పేరు చాలా బాగుందని నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు.

TAGS