AK Re entry : ఊహించిన దానికంటే ముందుగానే ఏకే రీఎంట్రీ?
Ak Re entry : వరుస నిరాశాజనక చిత్రాలతో సతమతం అవుతున్న అక్షయ్ కుమార్ ఏడాది విడుదల కానున్న జాలీ ఎల్ఎల్బీ 3, హౌస్ఫుల్ 5, వెల్కమ్ 3 వంటి చిత్రాలపై భారీగా హోప్స్ పెట్టుకున్నాడు. అయితే తన కొత్త చిత్రం ‘ఖేల్ ఖేల్ మే’తో ఫామ్ లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. 3.10 నిమిషాల నిడివి ఉన్న ‘ఖేల్ ఖేల్ మే’ ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. పాత స్నేహితుల బృందం తిరిగి కలవడంతో ఇది ప్రారంభమవుతుంది.
గ్రూపులోని వివిధ జంటలను ఒక్కొక్కరి రహస్యాలను ఈ ట్రైలర్ మనకు పరిచయం చేస్తుంది. ఒకరి ఫోన్లను మరొకరు పబ్లిక్ ప్రాపర్టీగా చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో వారి జీవితాలు ఛిన్నాభిన్నం కావడం మొదలవుతుంది, ఇది ఊహించని విషయాలకు దారితీస్తుంది.
ఈ ట్రైలర్ ను పరిశీలస్తే అక్షయ్ కుమార్ గత చిత్రాలకన్నా మంచి విజయం సాధిస్తుందని తెలుస్తోంది. ఇటీవల ‘సర్ఫిరా’ వంటి సీరియస్ బయోపిక్స్ లో నటించిన అక్షయ్ మళ్లీ ఈ జోనర్ లోకి రీఎంట్రీ ఇస్తున్న కామెడీ చిత్రం ‘ఖేల్ ఖేల్ మే’. ఇందులో అక్షయ్ కుమార్ సరసణ వాణి కపూర్, తాప్సీలు నటించారు. వివాహేతర సంబంధాల్లో హాస్యాన్ని జోడంచి వాటిని గొప్పగా చెప్పినట్లు తెలుస్తోంది. కానీ మేయిన్ గా వినోదంను మాత్రమే తీసుకున్నారని తెలుస్తుంది. జోకులు కాస్త అశ్లీలంగా ఉండొచ్చు కానీ, జనాలకు నచ్చే నవ్వులు పంచడమే వీటి లక్ష్యం.
ఖేల్ ఖేల్ మే కామెడీ, డ్రామా, ఎమోషన్స్ ను ఎఫెక్టివ్ గా మేళవించగలిగితే అక్షయ్ కుమార్ కు అది స్ట్రాంగ్ రీఎంట్రీ అవుతుంది. ఇది భారతదేశంలో పెద్దగా తెలియని విదేశీ చిత్రం పర్ఫెక్ట్ స్ట్రేంజర్స్ కు రీమేక్.
ముదస్సర్ అజీజ్ దర్శకత్వం వహించిన ఖేల్ ఖేల్ మే చిత్రంలో అక్షయ్ కుమార్, తాప్సీ పన్ను, ఫర్దీన్ ఖాన్, వాణి కపూర్, అమ్మీ విర్క్, ప్రగ్యా జైస్వాల్, ఆదిత్య సీల్ నటించారు. ఆగస్ట్ 15న థియేటర్లలోకి రానుంది.