Ajit Doval : ఆపరేషన్లలో దిట్ట అజిత్ దోవల్  మూడోసారి జాతీయ భద్రతా సలహాదారుగా నియామకం

Ajit Doval

Ajit Doval

Ajit Doval : నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అజిత్ దోవల్ మరోసారి జాతీయ భద్రతా సలహాదారుగా నియమితులయ్యారు. భారత జాతీయ భద్రతా సలహాదారుడిగా అజిత్ దోవల్ నియామకం కావడం ఇది మూడోసారి. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి పీకే మిశ్రాను ప్రధానమంత్రికి ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమితులయ్యారు. సీనియారిటీ జాబితాలో ఆయనకు  కేబినెట్ మంత్రి హోదాను కూడా ఇవ్వనున్నారు .అజిత్ దోవల్,   పీకే మిశ్రాల పదవీకాలం ప్రధాని నరేంద్ర మోడీతోనే పూర్తి కానుంది. దీనికి సంబంధించి కేబినెట్‌ అపాయింట్‌మెంట్‌ కమిటీ అజిత్‌ దోవల్‌ను ఎన్‌ఎస్‌ఏగా నియమించినట్లు లేఖ కూడా జారీ  చేసింది. ఈ ఆర్డర్ జూన్ 10 నుంచే  అమల్లోకి వస్తుంది.  

ప్రధానమంత్రి పదవీకాలంతోనే  అజిత్ దోవల్ నియామకానికి సంబంధించి జారీ చేసిన లేఖలో ఆయన నియామకం ప్రధాని మోడీ పదవీకాలంతో ముగియనుంది లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు, ఏది ముందైతే అదే ఫైనల్ అవుతుంది. ఆయనకు కేబినెట్ మంత్రి హోదా ఇవ్వనున్నారు.  రిటైర్డ్ ఐఏఎస్ పీకే మిశ్రా కూడా తన పదవిలో కొనసాగుతారు. 10 జూన్ 2024 నుంచే ప్రధానమంత్రికి ప్రిన్సిపల్ సెక్రటరీ గా పరిగణనలోకి తీసుకుంటారు. పీకే మిశ్రా 1972 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. దశాబ్ద కాలంగా ఆయన ప్రధాన కార్యదర్శిగా ప్రధాని మోదీతో కలిసి పనిచేస్తున్నారు. పీఎంఓలో నియామకాలు, పరిపాలనా వ్యవహారాలను పీకే మిశ్రా చూసుకుంటారు.

అజిత్ దోవల్ మరియు పికె మిశ్రాల నియామకం
2014లో తొలిసారిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం ఏర్పాటైన విషయం తెలిసిందే. ఆ సమయంలో అజిత్ దోవల్ జాతీయ భద్రతా సలహాదారుగా నియమితులయ్యారు. ఈ సమయంలో, పీకే  మిశ్రాను ప్రధాని  మోడీకి ప్రిన్సిపల్ సెక్రటరీగా అపాయింట్ చేశఆరు. రెండో టర్మ్‌లో కూడా అజిత్ దోవల్, పీకే మిశ్రాల అవే స్థానాల్లో కొనసాగారు.  ఇప్పుడు నరేంద్ర మోదీ మూడోసారి దేశానికి ప్రధానమంత్రి కావడంతో అజిత్ దోవల్‌ను జాతీయ భద్రతా సలహాదారుగా, పీకే మిశ్రాను మూడోసారి ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు.

ఆపరేషన్లలో దిట్ట అజిత్ దోవల్  
అజిత్ దోవల్ కెరీర్ ట్రాక్ రికార్డు అద్భుతంగా ఉంది. పోలీసు అధికారిగా ఎన్నో ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేశాడు. బీజేపీ హయాంలో ఎలా పనిచేశారో కాంగ్రెస్‌ హయాంలోనూ అలాగే పరి చేశారు. సిక్కింకు రాష్ట్ర హోదా ఇచ్చినప్పుడు  కీలక పాత్ర పోషించారు. 1984 అల్లర్లు జరిగినప్పుడు  పాకిస్తాన్‌లో ఉన్నాడు. అక్కడ గూఢచారిగా పనిచేశారు. 1988లో ఆపరేషన్ బ్లాక్ థండర్ లో కీలక పాత్ర పోషించారు. మూడు నెలలు పాకిస్థాన్ ఏజెంట్ గా ఉగ్రవాదులతో కలసి గోల్డెన్ టెంపుల్ లో తలదాచుకున్నట్లు సమాచారం. ఆయన నేతృత్వంలోనే ఎన్ఎస్‌జీ ఆపరేషన్ విజయవంతమైంది. 

TAGS