Aishwarya Arjun Wedding : సందడిగా ఐశ్వర్య అర్జున్ వివాహం..

Aishwarya Arjun wedding : అర్జున్ సర్జా కుమార్తె ఐశ్వర్య అర్జున్, తమిళ నటుడు రామయ్య కుమారుడు ఉమాపతి రామయ్య వివాహం చేసుకున్నారు. ఐశ్వర్య, ఉమాపతి జూన్ 10న ఒక్కటయ్యారు. ఈ జంట తమ పెళ్లి ఫొటోలను ఇన్‌ స్టాలో షేర్ చేసింది.

ఐశ్వర్య అందమైన ఎరుపు రంగు చీర ధరించగా, ఉమాపతి పంచె చొక్కా శల్య ధరించారు. ఈ ఫొటోలను షేర్ చేసిన ఐశ్వర్య 10.06.2024 అని క్యాప్షన్ రాసి, ఈవిల్ ఐ ఎమోజీ పెట్టింది.

ఐశ్వర్య ఎరుపు రంగు బిందీతో పాటు ఆకర్షణీయమైన ఆభరణాలు ధరించింది. గ్రాండ్ నెక్లెస్, దానితో మరో నెక్లెస్, అందమైన జముకి ధరించింది. ఆమె కట్టుకున్న ముదురు ఎరుపు రంగు పెళ్లి చీర అందంగా కనిపించింది.  ఇది కాకుండా, బిందెలో ఉంగరం కోసం దంపతులు వెతుకుతున్న ఫొటోను కూడా షేర్ చేసింది. సింపుల్‌ డిజైన్‌లో క్యూట్‌గా కనిపించింది. చెన్నైలోని హనుమాన్ దేవాలయంలో వివాహం వైభవంగా జరిగింది.

అర్జున్ సర్జా ఇంట్లో పెళ్లికి సంబంధించిన హల్దీ, మెహందీ వైభవంగా జరిగాయి. ఆ ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఐశ్వర్య, ఉమాపతి చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు.

వీరిద్దరూ ఓ టీవీ షోలో కలుసుకున్నారు. వీరి స్నేహం ప్రేమగా మారింది. ఈ విషయం పెద్దల దృష్టికి వెళ్లడంతో ఇరు కుటుంబాలు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. గతేడాది అక్టోబర్‌లో వీరి నిశ్చితార్థ జరిగింది.  సన్నిహితుల సమక్షంలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

కన్నడ హీరో అయిన యాక్షన్ కింగ్ అర్జున్ సర్జాకు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించాడు. అర్జున్ కూతురుగా ఐశ్వర్య ఇండస్ట్రీలోకి వచ్చినా గుర్తింపు మాత్రం దక్కలేదు. ప్రస్తుతం ఆమె మంచి హిట్ కోసం ఎదురు చూస్తోంది. ‘విశాల్ పటట్టు యానై’ సినిమాతో కథానాయకురాలిగా సినీ ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కన్నడ చిత్రం ‘ప్రేంబరహ’లో నటించంది. 

TAGS