Airtel Tariff Hike : ఎయిర్ టెల్ టారీఫ్ పెంపు: ఎంత చార్జి విధిస్తుందంటే?
Airtel Tariff Hike : జియో తర్వాత భారతదేశ రెండో అతిపెద్ద టెలికాం ఆపరేటర్ సంస్థ ‘భారతీ ఎయిర్‌టెల్’ ఈ సంస్థ దాని మొబైల్ టారిఫ్‌లను 10-21 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. సునీల్ భారతి మిట్టల్ కు చెందిన టెలికాం సంస్థ 3 జూలై, 2024 నుంచి మొబైల్ టారిఫ్‌లను సవరించనున్నట్లు స్పష్టం చేసింది. ఎంట్రీ లెవల్ ప్లాన్‌లపై ‘చాలా నిరాడంబరమైన’ ధర రోజుకు 70 పైసల కంటే తక్కువ పెరుగుతుంది.
దేశంలోని టెలికాం వ్యాపారం ఆర్థిక పరిపుష్టి కోసం మొబైల్ టెలికాం సర్వీస్ యావరేజ్ రెవెన్యూ ఫర్ యూజర్ (ARPU) రూ. 300 కంటే ఎక్కువ పెరగాలని భారతీ ఎయిర్‌టెల్ పేర్కొంది.
‘ఈ స్థాయి ARPU నెట్‌వర్క్ టెక్నాలజీ మరియు స్పెక్ట్రమ్‌లో అవసరమైన గణనీయమైన పెట్టుబడులను ఎనేబుల్ చేస్తుందని, మూలధనంపై నిరాడంబరమైన రాబడిని అందిస్తుందని మేము నమ్ముతున్నాము’ అని సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఇంకా, భారతీ ఎయిర్‌టెల్ ‘టారిఫ్‌లను రిపేర్ చేసేందుకు’ పరిశ్రమ ప్రకటనను కంపెనీ స్వాగతిస్తున్నట్లు తెలిపింది.
ఈ వారం ప్రారంభంలో జియో మొబైల్ టారిఫ్‌లను సవరించింది, 3 జూలై, 2024 నుంచి అమల్లోకి వచ్చే కొత్త అపరిమిత ప్లాన్ల శ్రేణిని ఆవిష్కరించింది. కొత్త టారిఫ్ ప్లాన్లు నెలకు 2GBకి రూ. 189 నుంచి రోజుకు 2.5 GB వార్షిక ప్లాన్‌కు రూ. 3,599 వరకు ఉంటాయి. ఈ ప్లాన్‌లలో 2GB/DAY, అంతకంటే ఎక్కువ ఉన్న అన్ని ప్లాన్లకు అపరిమిత 5G డేటా ఉంటుంది.
భారతీ ఎయిర్‌టెల్, దాని చైర్మన్ సునీల్ మిట్టల్ ప్రస్తుత ARPUను సుమారు రూ. 200 నుంచి రూ. 300 లేదా అంతకంటే ఎక్కువకు పెంచవలసిన అవసరాన్ని పదే పదే వ్యక్తం చేశారు. ‘మేము రూ. 300 ARPU స్థాయిలో ఉండాలి. మొదటి పిట్‌స్టాప్ రూ. 200. దానికి ఐదు నుంచి ఆరు సంవత్సరాలు పట్టింది.’ అని ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక ఇంటర్వ్యూలో మిట్టల్ చెప్పారు. 2024 మూడో క్వార్టర్లీలో ఎయిర్‌టెల్ ARPU రూ. 200 (రూ. 208 వద్ద) అగ్రస్థానంలో ఉంది.
2021, డిసెంబర్ లో టెలికాం కంపెనీలు వాటి టారీఫ్ లను పెంచాయి. దీని కన్నా ముందు 2019, డిసెంబర్ లో పెంచాయి. జియో 2016లో తన సర్వీస్‌ను ప్రారంభించిన తర్వాత ఇప్పుడే (2024) టారీఫ్ ను చేంజ్ చేసింది.