Nara Bhuvaneshwari : విమానంలో ప్రయాణికుడికి అస్వస్థత : నారా భువనేశ్వరి చొరవతో చికిత్స

Nara Bhuvaneshwari
Nara Bhuvaneshwari : హైదరాబాద్ నుంచి తిరుపతి వస్తున్న విమానంలో ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యాడు. అదే విమానంలో ఉన్న నారా భువనేశ్వరి చొరవతో సకాలంలో చికిత్స అందడంతో ప్రయాణికుడు కోలుకున్నాడు. ఈ ఘటన తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయంలో నిన్న (బుధవారం) చోటు చేసుకుంది.
బుధవారం మధ్యాహ్నం ఇండిగో విమానంలో హైదరాబాద్ నుంచి రేణిగుంటకు భువనేశ్వరి బయలుదేరారు. అదే విమానంలో హైదరాబాద్ కు చెందిన శశిధర్ ప్రయాణిస్తున్నారు. మార్గమధ్యంలో ఆయన అస్వస్థతకు గురై శ్వాస తీసుకునేందుకు ఇబ్బందిపడ్డారు. పరిస్థితిని గమనించిన భువనేశ్వరి వెంటనే సీఎం కార్యాలయానికి సమాచారం ఇచ్చారు.
కార్యాలయ ఆదేశాల మేరకు అధికారులు వెంటనే స్విమ్స్ హాస్పిటల్ వైద్యులను వెంటపెట్టుకొని రేణిగుంట విమానాశ్రయానికి వచ్చారు. విమానం రాగానే ప్రయాణికుడిని విమానాశ్రయంలోని అమర ఆసుపత్రి ఔట్ పేషెంట్ సెంటర్ కు తరలించి చికిత్స అందించారు. అనంతరం శశిధర్ కోలుకోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. సకాలంలో స్పందించిన నారా భువనేశ్వరిని తోటి ప్రయాణికులు అభినందించారు.