JAISW News Telugu

Portugal Air Show : దారి తప్పిన ఎయిర్ జెట్.. పోర్చుగల్ బెజాలో ఘోర ప్రమాదం.. పైలెట్ మృతి

Portugal Air Show

Portugal Air Show

Portugal Air Show : పోెర్చుగల్ దేశంలో జరుగుతున్న వైమానిక విన్యాసాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. రెండు విమానాలు ఎదురెదుగా ఢీకొనడంతో ఒక పైలెట్ దుర్మరణం చెందగా మరొకరికి తీవ్ర  గాయాలయ్యాయి. పోర్చుగల్ లోని బెజా ప్రాంతంలో ఆదివారం వైమానిక విన్యాసాల్లో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటన జరిగిన సమీపంలోని ఎయిర్ బేస్ లో ఒక జెట్ కూలిపోగా.. మరోటి సమీపంలో కుప్పకూలింది. 

సాధారణం ప్రతి దేశంలో ఎంతో ఎక్స్ పీరియన్స్ అయిన ఫైలెట్స్ ఇలాంటి విన్యాసాల్లో పాల్గొంటారు. చాలా రోజులు శిక్షణ తీసుకుని తర్వాతే ఇలాంటి ప్రోగ్రాంలతో పాల్గొంటారు. కానీ ఇలా జరగడం చాలా అరుదుగా కనిపిస్తుంటుంది. కొన్ని సార్లు ఎయిర్ పోర్స్ విమానాలు గాల్లో కూలిపోయాయని వింటుంటాం. కానీ విన్యాసాలు చేసిన సమయంలో కూలడం దురదృష్టకరం. 

అయితే పోర్చుగల్, స్పెయిన్ కు సంబంధించిన యాక్ స్టార్ గ్రూపు అనే ఏరోబోటిక్ సంస్థ సంయుక్తంగా విన్యాసాలు ప్రదర్శిస్తుండగా.. ఈ ఘటన చోటు చేసుకుంది. యాకోవ్లెవ్ 52 రకానికి చెందిన ఈ విమానాలు ప్రమాదానికి గురి కావడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ ప్రమాదానికి చెందిన దృశ్యాలను ఓ వ్యక్తి వీడియో తీసి ఎక్స్ లో పోస్టు చేయగా.. అది కాస్త వైరల్ గా మారి అందరికీ తెలిసిపోయింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన పైలెట్ స్పెయిన్ దేశానికి చెందిన వ్యక్తి కాగా, పోర్చుగల్ దేశానికి చెందిన మరో పైలెట్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

అయితే వీడియో లో చూస్తే ఈ విమానాలు మొదట సరిగానే ఎగిరాయి. పైకి వెళ్లిన తర్వాత ఒక విమానం సరైన దారిలోంచి వేరే మార్గంలో అతి వేగంగా ప్రయాణించింది. ఆ తర్వాత సరైన మార్గంలో వెళుతున్న నాలుగు విమానాల వైపు దూసుకొచ్చింది. దీంతో ఆ విమానాలు తప్పించుకున్నట్లు కనిపిస్తోంది. అనంతరం దారి తప్పిన విమానం బెజాలోని ఎయిర్ బేస్ లో కుప్ప కూలింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి.

Exit mobile version