Nellore District : బాలుడి కడుపులోకి గాలి.. వీడి సైకోయిజం తగలెయ్య.. ప్రాణాపాయ స్థితిలో..

Nellore District

Nellore District

Nellore District : సరదా అంటే దానికి కొన్ని హద్దులు ఉంటాయి. పరిధి దాటితే ఏదైనా మంచిది కాదు. వాటిని వికృత చేష్టలని అంటారు. రీసెంట్ గా ఓ వ్యక్తి చేసిన.. పని పనికి బాలుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. హాస్పిటల్ లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వెంకటాచలం మండలం, అనికేపల్లి గ్రామానికి చెందిన 12  ఏళ్ల బాలుడు. ఫ్రెండ్స్‌తో వాలీబాల్ ఆడుతున్నాడు. కొంత సేపు ఆడిన తర్వాత వాలీబాల్ లో గాలి తగ్గింది. గాలి కొట్టే పంపు కోసం గ్రామ సచివాలయం వద్దకు వెళ్లారు. అక్కడ తొలికొండ రాజా అనే వ్యక్తి, అతని బిహేవియర్ చూసి అక్కడి నుంచి అందరూ పారిపోయారు. కానీ, ఒక్క పిల్లవాడు మాత్రం దొరికిపోయాడు.

బాలుడి మలద్వారం నుంచి పైపును పెట్టి పంపుతో.. బలవంతంగా గాలి కొట్టాడు. ఇబ్బందికి గురైన బాలుడు ఇంటికి వెళ్లిపోయాడు. కొంత సేపటికి కడుపు ఉబ్బడంతో పాటు మర్మాంగాలు కూడా తీవ్రంగా ఉబ్బిపోయాయి. మొదట అసలు విషయం ఇంట్లో చెప్పలేదు. రాత్రి నొప్పి ఎక్కువవడంతో బిగ్గరగా ఏడ్వడం మొదలు పెట్టాడు. తల్లి దండ్రులు నెల్లూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడి నుంచి గవర్నమెంట్ ఆస్పత్రికి తలరించారు. ఐతే, బాధితుడి పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బలుడి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. 

TAGS