AI More Danger : అణ్వాయుధాల కంటే A.I. ప్రమాదం.. ఎలన్ మస్క్ సంచలన కోట్..
AI more Danger : ప్రపంచలోని శక్తి వంతమైన వారిలో ఎలన్ మస్క్ ముందు వరుసలో ఉంటారు. బాల్యం నుంచి ముళ్లబాటలో నడిచిన మస్క్ ప్రపంచం గుర్తించే స్థాయికి వెళ్లారు. మొదటి డ్రైవర్ రహిత కారు ‘టెస్లా’ను ప్రవేళపెట్టి ఆశ్చర్యం కలిగించాడు. దీనితో పాటు ‘స్పేస్ ఎక్స్’ కు కూడా ఆయన అధిపతిగా ఉన్నారు. ఎలన్ మస్క్ అంటే కేవలం పేరు మాత్రమే కాదని.. ఒక ప్రపంచంలోనే అతి సంపన్న, గొప్ప భావాలు, ఆలోచనలు ఉన్న వ్యక్తి అని చెప్పవచ్చు.
ఆయన ఇటీవల చేసిన కామెంట్ పురోగమనిస్తున్న టెక్నాలజీని ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం పూర్తిగా డిజిటల్ మయం అయిపోయింది. ఇంత పెద్ద భూగోళం చిన్న కుగ్రామంగా మారింది. దీనికి కారణం టెక్నాలజీ.. ఇది ప్రతీ ఒక్కరూ అంగీకరించాల్సిన నిజం. ప్రస్తుతం జమానా చాట్ జీపీటీ, ఏఐతో లింక్ అయి ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటలీజన్స్ (A.I) చాలా వేగంగా స్పందిస్తుంది. ప్రతీ విషయాన్ని లోతుగా అధ్యయనం చేసి చూపుతుంది. చాలా రంగాల్లో ఏఐ సేవలు రాను రాను పెరుగుతాయని సాంకేతిక నిపుణులు ఎప్పుడో చెప్పారు.
ఆర్టిఫిషియల్ ఇంటలిజెంట్ పై మస్క్ ఏమన్నారంటే ‘అణ్వాయుధాల కంటే ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్ మరింత ప్రమాదం’. పెరుగుతున్న సాంకేతికత మానవ ఆయుష్షును తగ్గిస్తుందని ఒప్పుకోకతప్పదు. ఒక వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలను ఏఐ చిటికెలో సేకరించగలదు. ఇది వ్యక్తిగత గోప్యతకు అతిపెద్ద సవాల్ గా మారుతుంది. ఇది మరింత ఇబ్బంది పెట్టే విషయం అనే గోణంలో చెప్పారా..? లేక ఏఐ మున్ముందు మనుష్షులు చేసే పనులు చేస్తూ మరింత ఉపాధి తగ్గిస్తూ.. జీవన ప్రమాణాలను నాశనం చేస్తుందన్న ఉద్దేశంతో అన్నారా తెలియదు గానీ.. ఆయన వ్యాఖ్యలను చాలా మంచి స్వాగతిస్తున్నారు.