JAISW News Telugu

AI Doctors : చైనాలో ఏఐ డాక్టర్లతో హాస్పిటల్ ప్రారంభం.. ప్రపంచం చూపు ఆ హాస్పిటల్ వైపు

AI Doctors

AI Doctors

AI doctors in Chania : ప్రపంచం ఎంత అడ్వాన్స్ డ్  మారిపోయిందంటే కృత్రిమ డాక్టర్ల సాయంతో చికిత్స చేయించుకునేందుకు కూడా సిద్ధపడిపోయారు. ప్రస్తుతం ఎక్కడ చూసిన ఏఐ పైనే చర్చ సాగుతోంది. ఏఐ క్రియేట్ చేస్తున్న వింత అనుభవాలు ఒక్కొక్కరికి మతి పోగోడుతున్నాయి.

ఇలాంటి టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో చైనా ఎప్పుడు ముందుంటుంది. చైనా తాజాగా ఏఈ సహాయంతో  హాస్పిటల్ ను ప్రారంభించింది. ఇందులో 14 మంది ఏఐ డాక్టర్లను (రోబిటిక్ )లను ప్రవేశపెట్టింది. ఈ రోబోలు మాత్రమే మనుషులకు వైద్యం చేస్తాయి. ఈ హాస్పిటల్ ను టిసుంగా యూనివర్సిటీ చైనా వారు 14 మంది ఏఐ డాక్టర్లతో ప్రారంభించారు. ఈ వార్త పెను సంచలనంగా మారింది.

ప్రపంచ వ్యాప్తంగా డాక్టర్ల కొరత వేధిస్తున్న తరుణంలో చైనాలో ఇలా కృత్రిమ మేధ ద్వారా చికిత్స అందించడం అద్భుతమనే అంటున్నారు. కానీ ఏఐ డాక్టర్లు ఎలాంటి చికిత్సలు చేయగలరు. ఎలాంటి సర్జరీలు చేస్తాయి. ఏమేం సత్తా ఉందని ఇంకా బయటకి తెలపడం లేదు. ఈ హాస్పిటల్ ప్రత్యేకత గురించి తెలుసుకోవాలంటే  మరిన్ని రోజులు ఆగాల్సిందే. ఇక డాక్టర్ల చదువు, లక్షలు కోట్లు పెట్టి చదివించడం ఇవన్నీ మానేసి ఏఐ డాక్టర్లను సంప్రదిస్తే సరిపోతుందని కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం డయాగ్నోస్టిక్ ట్రీట్ మెంట్ విధానంలో పనిచేసే లా ఏఐ డాక్టర్లు పని చేయనున్నారు. ఇది రాబోయే కాలంలో హెల్త్ కేర్ రంగంలో విప్లవత్మాక మార్పులు తీసుకురాబోతుందని టిసుంగా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆర్టిఫిషీయల్ ఇంటిలిజెన్స్ ద్వారానే భవిష్యత్తులో అన్ని రకాల వైద్య సేవలు అందే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. చైనా చేసిన ఈ పనికి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఏఐను సమర్థవంతంగా ఉపయోగించుకోవడంలో చైనా తర్వాతే ఎవరైనా నెట్టింట పొగుడుతున్నారు. ఇండియాలో కూడా ఇలాంటి బోలెడన్నీ హాస్పిటల్స్ ప్రారంభిస్తే బాగుంటుందని అడుగుతున్నారు. వైద్యో నారాయణ హరి బదులు.. ఇక ఏఐ నారాయణ హరి అంటారేమో చూడాలి.

Exit mobile version