
Byjus Coaching Centre
Byjus Coaching Centre : హైదరాబాద్ నారాయణగూడలోని బైజూస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. కోర్సు పూర్తి కాకముందే బైజూస్ యాజమాన్యం బోర్డు తిప్పేసిందని బాధిత విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాయణగూడలోని ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ముందు బైఠాయించారు. తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
2022-24 కోర్సు కోసం ఒక్కొక్కరి వద్ద రూ.1,50,000లు వసూలు చేసి మధ్యలోనే బోర్డు తిప్పేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్సు మధ్య ఆపేసి తమను రోడ్డుపై వదిలేశారని విద్యార్థులు అన్నారు. మధ్య తరగతి కుటుంబాలకు చెందిన తాము సివిల్స్ లో ఉద్యోగం సాధించాలని ఈ కోర్సు తీసుకున్నట్లు చెప్పారు. అయితే బైజూస్ సంస్థ 50 శాతం సిలబస్ కూడా పూర్తి చేయలేదని, ఇప్పుడు కోచింగ్ సెంటర్ కు తాళాలు వేశారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఫ్యాకల్టీని అడిగితే కోర్టులో కేసు నడుస్తుందని, తమకు ఎలాంటి సంబంధం లేదని చేతులు ఎత్తేశారని తెలిపారు. బైజూస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ వల్ల సమయానని, డబ్బును పోగొట్టుకున్నామని రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని విద్యార్థులు కోరారు.