Aghori : అఘోరీ ఆత్మార్పణయత్నం చేసింది. గత నెల రోజులుగా తెలంగాణలో హల్చల్ చేసిన లేడీ అఘోరీ ఇప్పుడు ఆంధ్రలో తిరుగుతోంది. శ్రీకాళహస్తి ఆలయ దర్శనానికి వచ్చిన అఘోరీని సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఆమె తీవ్ర మనస్థాపంతో పెట్రోల్ క్యాన్ తీసుకుని సూసైడ్ చేసుకునేందుకు ప్రయత్నించింది. వెంటనే అక్కడ ఉన్న పోలీసులు ఆమెను అడ్డుకున్నారు.
గత కొన్ని రోజులుగా ఈమె సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యారు. కార్తీక మాసం కావడంతో ఏపీలోని అన్ని దేవాలయాలను సందర్శిస్తూ శ్రీకాళహస్తి గుడిలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. కాగా అక్కడ ఉన్న సెక్యూరిటీ అడ్డుకున్నారు.
ఆలయంలో దర్శనం చేసుకోవాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయని.. ఇలా దిగంబరంగా దర్శనానికి అనుమతి లేదని భద్రతా సిబ్బంది తేల్చి చెప్పారు. ఇదే విషయం తనకు ముందుగా చెబితే బాగుంటుందని దర్శనానికి వచ్చిన సమయంలో ఇలా చేయడం సరికాదని ఆమె అన్నారు. విశాఖలో ఆలయాల సందర్శన సమయంలో తాను డ్రెస్ రూల్స్ పాటించానని అఘోరీ చెప్పారు. కానీ ఇక్కడ ఏ విషయం చెప్పకుండా తనను ఇబ్బంది పెట్టారని ఆత్మార్పణ చేసుకుంటానని కారులో ఉన్న పెట్రోల్ తీసుకుని ఒంటిపై పోసుకుంది.
వెంటనే స్పందించిన పోలీసులు ఆమెను అడ్డుకుని అంబులెన్స్ లో ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాగా ఆమెపై పోలీసులు కేసు నమోదు చేస్తారా? లేదా అన్న విషయంపై సందిగ్ధం నెలకొంది. ఇప్పటి వరకు తెలంగాణ, ఏపీల్లో అఘోరీలపై కేసులు పెట్టినట్లు ఎక్కడ లేదు. అయితే కాశీలో ఇలాంటి దిగంబర సన్యాసులు నిత్యం వేలల్లో కనిపిస్తుంటారు. హిమలయ పర్వతాల్లో తపస్సు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తుంటారు. అలాంటి అఘోరీ ప్రజల మధ్యకు రావడం ఏంటనీ చాలా మంది ప్రశ్నిస్తున్నారు. పోనీ వచ్చినా తన పని తాను చేసుకోకుండా ఆత్మార్ఫణం చేసుకుంటానని బెదిరిస్తూ పోలీసులకు తల నొప్పి గా మారింది. దీంతో ఆమె ఎక్కడకు వెళ్లినా భద్రత ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది.