Aghori : అఘోరీల పెళ్లిళ్లు, కాపురాలు.. బ్రహ్మం గారు ముందే చెప్పారు..
Aghori : కలియుగంలో ఏం జరుగుతుందో ముందుగానే చెప్పిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం ఎప్పుడూ సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలుస్తుంది. తాజాగా, బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పిన మాటలు ఇప్పుడు నిజమవుతున్నాయని పలువురు చర్చించుకుంటున్నారు. అదే అఘోరీల గురించి.
నిత్యం నియమ నిష్టలతో మంచుకొండల్లో, హిమాలయాల్లో తపస్సు చేసుకునే అఘోరీలు ఇప్పుడు జనారణ్యంలోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్లుగానే, కొందరు అఘోరీలు జనంలో కలిసిపోయి పూజల పేరుతో అమాయక ప్రజలను దోచుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆధ్యాత్మికతను వ్యాపారంగా మార్చుకొని సొమ్ము చేసుకుంటున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, అఘోరీలు కూడా వివాహం చేసుకుంటారంటూ బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్లుగా ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. సాధారణంగా అఘోరీలు వైరాగ్య జీవితాన్ని గడుపుతారు, కానీ రాబోయే కాలంలో వారిలో మార్పు వస్తుందని బ్రహ్మంగారు ముందే చెప్పారని విశ్వసిస్తున్నారు. ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కొందరు ఇది కాల మహిమ అని అంటుంటే, మరికొందరు మాత్రం ఇది అఘోరీ సంప్రదాయానికి విరుద్ధమని అభిప్రాయపడుతున్నారు.
బ్రహ్మంగారు చెప్పిన ప్రతి విషయం నిజమవుతోందని నమ్మే భక్తులు ఈ పరిణామాలను ఆశ్చర్యంగా గమనిస్తున్నారు. హిమాలయాల నుండి జనంలోకి రావడం, ప్రజలను దోచుకోవడం, చివరకు వివాహాలు చేసుకోవడం వంటి విషయాలు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ముందే చెప్పబడ్డాయని వారు అంటున్నారు.
మొత్తానికి, అఘోరీల ప్రస్తుత ప్రవర్తన, వారి వివాహాలపై జరుగుతున్న చర్చ బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది. రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.