Poonam Kaur : పూనమ్ కౌర్ తెలుగు ఫిల్మ్ఇండస్ట్రీలో హిరోయిన్ గా సెటిల్ అవ్వాలనుకుని కొన్ని కారణాల వల్ల దూరమైంది. అనంతరం తమిళ, కన్నడ భాషల్లో కూడా హిరోయిన్ గా నటించింది. చేసింది కొన్ని సినిమాలే అయినా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తన గ్లామర్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది. ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ పై విరుచుకుపడుతూనే ఉంది.
వీరి మధ్య ఏం జరిగిందో క్లారిటీ లేకపోయినప్పటికీ.. అవకాశం చిక్కినప్పుడల్లా కూడా పవన్, త్రివిక్రమ్లపై మండిపడుతుంటుంది. రెండు రోజుల క్రితం దర్శకుడు త్రివిక్రమ్ గురించి కామెంట్స్ చేసింది. త్రివిక్రమ్ చెడు స్వభావం గురించి తనకు తెలుసని అంటున్నారు.
నేను నా అనుభవంతో మాట్లాడుతున్నాను.. త్రివిక్రమ్ లాంటి జీవితాలను నాశనం చేసే వ్యక్తిని నమ్మొద్దని అంటున్నాను. పవన్ కల్యాణ్ గురించి కూడా ఓ ఆసక్తికర ట్వీట్ చేసింది. నాయకుడు ఎలా స్త్రీల గురించి ఆలోచిస్తారో తమ అనుచరులు కూడా అలాగే ఆలోచిస్తారంటూ పరోక్షంగా ట్వీట్ చేసింది. ఇది కచ్చితంగా పవన్ కల్యాణ్ గురించే అని తెలుస్తోంది.
నాయకుడిగా ఉండటం అనేది బాధ్యతాయుతమైన విషయం కానీ చాలామంది దాన్ని స్వీయ కీర్తి కోసం ఉపయోగిస్తారు. నాయకుడిగా ఉండటం అనేది రెస్పెప్టిక్ అంశం. స్వీయ కీర్తి కోసం దీన్ని ఉపయోగింకుంటున్నారు. ప్రతి పొలిటికల్ లీడర్ ప్రజా నాయకుడు కాలేడని చెబుతున్నారు. పవన్ కల్యాణ్ పేరు చెప్పకుండానే ఆయనపై పరోక్ష్ంగా విమర్శించారు.
అయితే దీనిపై పూనమ్ కౌర్ పై నెటిజన్ కామెంట్ చేశారు. నీకు పని లేదు. పాటలేదు. యూస్ లెస్ ఇడియట్ అంటూ కామెంట్ చేయగా.. పూనమ్ దానికి రిఫ్లై ఇచ్చింది. మీ గురుజీ తొక్కెస్తాడు.. మాకు ఇంకెక్కడి అవకాశాలు అంటూ ఆవేదన వెల్లగక్కింది. నిజాలు తెలుసుకుని మాట్లాడు అంటూ కామెంట్స్ చేసింది.