JAISW News Telugu

Pakistan : ఐర్లాండ్ పై గెలిచినా పాకిస్తాన్ ఇంటికే..

Pakistan

Pakistan Eliminated

Pakistan : ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024లో  అమెరికా-ఐర్లాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. దీంతో అమెరికా సూపర్ 8కి చేరుకుంది.  కాగా పాకిస్థాన్ జట్టు టోర్నీ నుంచి ఎలిమినేట్ అయ్యింది.  అంతే కాదు పాకిస్థాన్‌తో పాటు కెనడా, ఐర్లాండ్ జట్లు కూడా సూపర్ 8 రేసు నుంచి తప్పుకున్నాయి.

టాస్ కూడా పడలేదు
ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగాల్సి ఉండగా,  వర్షం కారణంగా ఫీల్డ్ పరిస్థితులు చాలా దారుణంగా  మారాయి. దీంతో టాస్ వేయడం సాధ్యం కాలేదు.  దీంతో అమెరికా సూపర్ 8కి చేరుకుంది.  ఇప్పటికే భారత్‌, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌, ఆఫ్ఘనిస్థాన్‌  జట్లు ఇప్పటికే ప్లేఆఫ్‌కు చేరుకున్నాయి. అంటే ఇప్పటి వరకు ఆరు జట్లు సూపర్ 8కి చేరుకోగా కేవలం రెండు స్థానాలు మాత్రమే మిగిలాయి.

అమెరికా, ఐర్లాండ్‌ల మధ్య మ్యాచ్ వాష్ అవుట్ కావడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఈ పరిస్థితుల్లో అమెరికా జట్టు 5 పాయింట్లు సాధించి సూపర్-8కి అర్హత సాధించింది. జూన్ 16న ఐర్లాండ్‌తో జరిగే చివరి మ్యాచ్‌లో పాక్ జట్టు గెలిచినా.. కేవలం 4 పాయింట్లను మాత్రమే చేరుకోగలదు. అయితే ఆ మ్యాచ్ కూడా వాష్ అవుట్ అయ్యే అవకాశం ఉంది.

ఇప్పటికే సూపర్-8లో కి టీమీండియా  
ప్రస్తుతం గ్రూప్-ఎలో పాయింట్ల పట్టికలో 6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న భారత జట్టు సూపర్ 8కి అర్హత సాధించింది. అమెరికా జట్టు 5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి సూపర్ 8లోకి కూడా అడుగుపెట్టింది. అమెరికా పాకిస్థాన్, కెనడాలను ఓడించగా, భారత్ చేతిలో ఓడిపోయింది. పాక్ జట్టు 2 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. దీని తర్వాత కెనడా, ఐర్లాండ్  ఉన్నాయి.

శనివారం లాడర్‌హిల్‌లో కెనడాతో భారత్‌ తలపడనుండగా, ఐర్లాండ్‌తో పాకిస్థాన్‌ తలపడనుంది. అమెరికాతో జరిగిన మ్యాచ్‌ని రద్దు చేయడానికి ముందు భారత్, కెనడా చేతిలో ఓడిపోయిన ఐర్లాండ్ గ్రూప్ Aలో ఇంకా గెలవని ఏకైక జట్టు.

USA vs IRE: అమెరికా- ఐర్లాండ్ మ్యాచ్ రద్దు.. వరల్డ్ కప్ నుండి పాకిస్థాన్ ఔట్
Exit mobile version