Modi-Chandrababu-Pawan : పదేళ్ల తర్వాత ఒకే వేదికపై ముగ్గురు.. మారో సారి గెలుపు ఖాయమా?
Modi-Chandrababu-Pawan : కొన్ని కొన్ని సూచనలు కొన్ని కొన్ని శుభకార్యాలు కలిగేలా చేస్తాయి. దీన్ని చాలా మంది విశ్వసిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత 2014లో జరిగిన ఒక సంఘటన మళ్లీ ఇన్నాళ్లకు అంటే పదేళ్లకు పునరావృతమైంది. అప్పుడు ఈ ఘట్టంతో టీడీపీ అధికారంలోకి వస్తే.. ఇప్పుడు కూడా ఇదే ఘట్టం కూటమిని అధికారంలోకి తెస్తుందని పలువురు విశ్వసిస్తున్నారు. అదేంటో తెలుసుకుందాం.
2014లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించిన ఏడాది తర్వాత తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీలతో కలిసి మహాకూటమిగా ఏర్పడింది. 2014లో నిర్వహించిన ఒక బహిరంగ సభలో, ప్రధాని మోడీతో పాటు పవన్ కళ్యాణ్ మరియు చంద్రాబాబు నాయుడు వేదికను పంచుకున్నారు. ఆ సమయంలో ఈ సభ భారీ ప్రభావాన్ని సృష్టించింది. ఎంతలా అంటే కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేంతగా.
ఇక, ఇప్పుడు (2024) పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడిలో జరుగుతున్న #PrajaGalam సభలో ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒకే వేదికను పంచుకున్నారు. 2014లో ఆంధ్రప్రదేశ్ లో గెలిచేందుకు ఈ ముగ్గురూ కలిసి పని చేయగా, 2019లో విడిపోయారు. ఆ సమయంలో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా మళ్లీ మహా కూటమి పేరుతో ఒక్కటయ్యారు.
ఈ కార్యక్రమంలో మోదీ ప్రసంగాన్ని ప్రారంభిస్తూ ‘భారత్ మాతా కీ జై’ అంటూ మొదలు పెట్టారు. ‘నా ఆంధ్ర కుటుంబ సంబులందరికి నమస్కారాలు’, అనడంతో జనం హర్ష ధ్వానాలు, అరుపులు, చప్పట్లతో మోడీని ముంచెత్తారు. పదేళ్ల తర్వాత రెండోసారి వేదికపైకి వచ్చిన ఈ ముగ్గురూ ఎన్నికల్లోనూ అదే విజయాన్ని పునరావృతం చేస్తారా? చూద్దాం.