Kejriwal : మోదీ తర్వాత బీజేపీలో ప్రధాని అభ్యర్థి ఎవరు?: కేజ్రీవాల్

Kejriwal

Kejriwal

Kejriwal : మోదీ తర్వాల బీజేపీలో ప్రధాని అభ్యర్థి ఎవరని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మధ్యంతర బెయిల్ రావడంతో అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శనివారం ఆయన ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ కార్యాలయం వద్ద పార్టీ నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఒక పార్టీ కాదని, ఓ సిద్ధాంతమని అన్నారు. తమను అణగదొక్కేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. మోదీ తర్వాత బీజీపీ నుంచి ప్రధాని ఎవరు అవుతారని ఆయన ప్రశ్నించారు.

‘‘విపక్ష ఇండియా కూటమికి నాయకుడు ఎవరు? అని బీజేపీ పదేపదే అడుగుతోంది. మరి వారి ప్రధాని అభ్యర్థి ఎవరు? వచ్చే సెప్టెంబరు 17 నాటికి మోదీకి 75 ఏళ్లు వస్తాయి. బీజేపీలో ఆ వయసు వారు రిటైర్మెంట్ తీసుకోవాలని ప్రధానే నిబంధన పెట్టారు. అద్వాణీ, మురళీ మనోహర్ జోషీ, సుమిత్రా మహజన్ లాంటి వారిని అలాగే పక్కనపెట్టారు. మరి మోదీ కూడా రిటైర్ అవుతారా? అలాగైతే ప్రధానిగా వారిలో ఎవరిని ఎన్నుకుంటారు?’’ అని సీఎం కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఎన్నికల తర్వాత రెండు నెలల్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను పక్కన బెడతారని జోస్యం చెప్పారు.

TAGS