Box office : ఐదేళ్ల తర్వాత బాక్సాఫీస్ వద్ద తలపడనున్న స్టార్ హీరోలు.. ఎవరు విజయం సాధిస్తారో?
Box office : దాదాపు ఐదేళ్ల తర్వాత రవితేజ, రామ్ పోతినేని సిల్వల్ స్క్రీన్ పై తలపడనున్నారు. 2021లో రిలీజైన ఇద్దరి సినిమాల్లో రామ్ పోతినేని మూవీ పోటీ నుంచి కొంచెం వెనుకబడింది. కానీ వసూళ్ల పరంగా అదికూడా మంచి విజయమే సాధించింది. ఇప్పుడు, ఐదేళ్లకు పోటీ పడనున్నాయి.
రవితేజ-హరీశ్ శంకర్ కాంబోలో ‘భాగ్యశ్రీ బోర్సే’ హీరోయిన్ గా నటించిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. పూరి జగన్నాథ్ – రామ్ పోతినేని కాంబోలో వస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’తో పోటీ పడి 2024, ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆగస్ట్ 14 సాయంత్రం నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఓ ప్రముఖ తెలుగు హీరోకు ఇదే తొలిసారిగా ప్రీమియర్ షోలు వేయనున్నారు. చిన్న సినిమాలకు పెయిడ్ ప్రీమియర్స్ మామూలే అయినా, పెద్ద హీరో సినిమాకి ఇలాంటివి రావడం ఇదే మొదటిసారి.
బాక్సాఫీస్ హిట్ సాధించిన ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్ గా తెరకెక్కిన ‘డబుల్ ఇస్మార్ట్’ కూడా ఆగస్ట్ 15న విడుదల కానుంది. సీక్వెల్ ఫ్యాక్టర్, మణిశర్మ సంగీతంతో మంచి ఓపెనింగ్స్ వస్తాయనే అంచనాలు బలంగా ఉన్నాయి.
2011లో వచ్చిన ‘మిరపకాయ్’ తర్వాత రవితేజ-హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. 2021 సంక్రాంతికి రవితేజ క్రాక్, రామ్ పోతినేని రెడ్ పోటీ పడ్డాయి. క్రాక్ బ్లాక్ బస్టర్ గా నిలవగా, రెడ్ ఓ మోస్తరు విజయం సాధించింది. దాదాపు ఐదేళ్ల తర్వాత ఈ ఇద్దరు హీరోలో మరోసారి బాక్సాఫీస్ వద్ద తలపడపోతున్నారు. ఇందులో రవితేజ మరోసారి గెలుస్తాడా.? లేక రామ్ బాక్సాఫీస్ వద్ద రవితేజను ఓడిస్తాడో వేచి చూడాలి.
ఈ పోటీలో నివేదా థామస్ నటించిన ‘35 చిన్న కథ కాదు’. చియాన్ విక్రమ్ ‘తంగలాన్’ (తెలుగు డబ్), నార్నే నితిన్ ‘ఆయ్’ ఉన్నాయి. ఇవి ఈ స్వాతంత్ర్య దినోత్సవాన్ని సినీ అభిమానులకు ట్రీట్ ఇవ్వనున్నాయి.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ‘మిస్టర్ బచ్చన్’లో జగపతిబాబు ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. పలువురు ప్రముఖ నటులు సహాయక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చారు.