Chandrababu After 29 : స్కిల్ స్కాం కేసులో అరెస్ట్, 50 రోజులకు పైగా జైలు జీవితం గడిపిన చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ హై కోర్టు మూడు వారాల షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ ను ఆయన అనారోగ్య కారణాల దృష్ట్యా కోర్టు ఇచ్చింది. ఈ నిబంధనల ప్రకారం.. చంద్రబాబు నాయుడు కేవలం హాస్పిటల్ లేదంటే ఇంట్లో మాత్రమే ఉండాలి. సాక్షులను ప్రలోభాలకు గురి చేసే పనులు చేపట్టవద్దు. ఎలాంటి రాజకీయ, పార్టీ సభలు, సమావేశాలు నిర్వహించవద్దు అంటూ షరతులు విధించింది.
అయితే హై కోర్టు విధించిన గడువు ఈ నెల 28వ తేదీతో ముగుస్తుంది. దీని నేపథ్యంలో ఇటీవల చంద్రబాబు మరోసారి తన బెయిల్ పిటీషన్ ను మూవ్ చేశారు. పిటీషన్ ను స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం ఈ రోజు (నవంబర్ 20) బెయిల్ ను మంజూరు చేసింది. దీంతో ఆయన ఈ నెల 28న రాజమండ్రి జైలుకు వెళ్లాల్సిన పని లేదని న్యాయమూర్తి మల్లికార్జున్ రావు తీర్పు చెప్పారు. అయితే ఈ నెల 30వ తేదీన ఏసీబీ కోర్టు ఎదుట చంద్రబాబు హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశించారు. చికిత్సకు సంబంధించిన నివేధికను ఏసీబీ కోర్టులో అప్పగించాలని ఆదేశాలు జారీ చేశారు.
అయితే ఇప్పటి వరకు మద్యంతర బెయిల్ పై బయట ఉన్న చంద్రబాబుకు కోర్టు విధించిన షరతులు 28వ తేదీతో ముగుస్తాయి. అంటే ఆయన 29వ తేదీ తన రాజకీయ సమావేశాలు, మీటింగులు, బహిరంగ సభల్లో పాల్గొనవచ్చు. బాబు మళ్లీ జనంలోకి వస్తుండడంతో తెలుగు తమ్ముళ్లతో సహా, ఏపీ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తు్న్నారు.