Saindhav Collections : చాలా కాలం తర్వాత విక్టరీ వెంకటేష్ సోలో హీరో గా నటించిన ‘సైంధవ్’ చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13 వ తారీఖున విడుదలై పర్వాలేదు అనే రేంజ్ టాక్ ని సొంతం చేసుకుంది. సాధారణంగా సంక్రాంతి కి వచ్చే విక్టరీ వెంకటేష్ సినిమాలను చూసేందుకు ఫ్యామిలీ ఆడియన్స్ ఎగబడతారు. లేడీస్ అయితే థియేటర్స్ బయట కిలోమీటర్ల మేరకు బారులు తీరుతారు.
గతం లో ఎన్నో వెంకటేష్ సినిమాలకు ఇలా జరిగాయి. ‘ఎఫ్ 2 ‘ చిత్రం కూడా అలాగే ఆడింది. కానీ ‘సైంధవ్’ చిత్రానికి ఎందుకో మొదటి రోజు నుండే వసూళ్లు లేవు. సినిమాకి కావాల్సిన ప్రీ రిలీజ్ హైప్ దక్కకపోవడం వల్లనో ఏమో తెలియదు కానీ, సంక్రాంతికి ఉండాల్సిన వెంకటేష్ సినిమా వసూళ్ళలో పావు శాతం కూడా ఈ చిత్రానికి లేదనే చెప్పాలి. కానీ సంక్రాంతి రోజు మాత్రం మెజారిటీ సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ పడ్డాయి.
కానీ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఆ వసూళ్లు ఏమాత్రం సరిపోవు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 25 కోట్ల రూపాయలకు జరిగింది. కానీ మూడు రోజులకు కలిపి ప్రపంచవ్యాప్తంగా కేవలం 7 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఫుల్ రన్ లో పది కోట్ల రూపాయిల మార్కుని కూడా దాటేలాగా అనిపించడం లేదు. ఓవరాల్ గా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. గడిచిన 20 ఏళ్లలో వెంకటేష్ నటించిన సినిమాల్లో ఈ రేంజ్ డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది 2005 వ సంవత్సరం లో వచ్చిన ‘సుభాష్ చంద్రబోస్’ అనే చిత్రం. ఈ సినిమా తర్వాత మళ్ళీ వెంకీ కెరీర్ లో ఆ రేంజ్ సంక్రాంతి డిజాస్టర్ ఫ్లాప్ గా ‘సైంధవ్’ చిత్రం నిల్చింది.
వాస్తవానికి ‘సైంధవ్’ చిత్రం కంటెంట్ పరంగా చూసుకుంటే ‘గుంటూరు కారం’ మరియు ‘నా సామి రంగ ‘ కంటే ఎంతో బెటర్ అని చెప్పొచ్చు. కానీ సంక్రాంతికి జనాలు ఇలాంటి సినిమాలు చూసేందుకు ఇష్టపడరు. పైగా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘హనుమాన్’ మూవీ మేనియా పట్టుకుంది. ఇలాంటి పరిస్థితిలో ‘సైంధవ్’ లాంటి చిత్రాలు రన్ కొనసాగించడం కష్టమే. డిసెంబర్ 22 వ తారీఖున విడుదల అయ్యుంటే కచ్చితంగా మంచి ఫలితం వచ్చేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.