
YS Jagan
YS Jagan : విదేశీ పర్యటన ముగించుకుని సీఎం జగన్,భారతి దంపతులు రేపు రాష్ట్రానికి రానున్నారు. ఇవాళ రాత్రి వారు లండన్ నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు. రేపు ఉదయం గన్నవరం విమానాశ్రయానికి వారు చేరుకోనున్నారు.
కాగా ఎన్నికలతో బిజీబిజీగా గడిపిన జగన్ ఈ నెల 17న లండన్ పర్యటన కు వెళ్లిన సంగతి తెలిసిందే. సీబీఐ కోర్టు నుంచి సీఎం జగన్ ప్రత్యేక అనుమతులు పొంది విదేశీ పర్యటనకు వెళ్లారు. అక్కడి నుంచి కుమార్తెలతో కలిసి ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ లో ఆయన పర్యటించారు. 15 రోజుల అనంతరం రాష్ట్రానికి వస్తున్నారు.