Rashid Khan : ఆఫ్ఘన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ వివాహం.. ఎంత భారీగా చేసుకున్నారంటే?

Rashid Khan

Rashid Khan

Rashid Khan Marriage : ఆఫ్ఘనిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ వివాహం అక్టోబర్ 3 (గురువారం) కాబూల్‌లో వైభవంగా జరిగింది. ఆయన వివాహం చేసుకన్నారన్న విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వివాహానికి సంబంధించి వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ అవుతోంది. ఈ వివాహానికి ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన పలువురు క్రికెటర్లు హాజరయ్యారు. వేడుక సందర్భంగా హోటల్ బయట పటాకులు కాల్చారు. రషీద్ పెళ్లి వేధిక వద్ద చాలా మంది తుపాకులతో తిరుగుతూ కనిపించారు. పలువురు క్రికెటర్లు సోషల్ మీడియా ద్వారా రషీద్ పెళ్లికి శుభాకాంక్షలు తెలిపారు. రషీద్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాప్ స్పిన్నర్‌లలో ఒకరు. వైట్-బాల్ క్రికెట్‌లో అతను T20 లో లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తూ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడతాడు. దక్షిణాఫ్రికాపై ఆఫ్ఘనిస్థాన్ సిరీస్ విజయంలో లెగ్ స్పిన్నర్ కీలక పాత్ర పోషించాడు. 93 T20 మ్యాచ్‌ లలో 152 వికెట్లు, 105 వన్డేల్లో 190 వికెట్లు తీశాడు. అయితే ఆఫ్ఘన్ కు వరల్డ్ కప్ సాధించే వరకు వివాహం చేసుకోనని గతంలో ఒక సందర్భంలో అన్నారట రషీద్ ఖాన్ దీంతో ఎక్స్, ఇన్ స్టాలో కామెంట్లు మొదలయ్యాయి. ఆఫ్ఘాన్ కు ఎప్పుడు వరల్డ్ కప్ వచ్చిందని కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా రషీద్ ఖాన్ వివాహంతో అందరు క్రికెటర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

TAGS