Adudam Andhra:ఏపీలో `ఆడుదాం ఆంధ్ర` పేరుతో ఈ రోజు కొత్త కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. గుంటూరు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్తో పాటు మంత్రి ఆర్కె రోజా పాల్గొన్నారు. వైఎస్ జగన్ బ్యాటింగ్ చేయగా, బైరెడ్డి సిద్ధార్ధ్రెడ్డి బౌలింగ్ చేశారు. జగన్ బ్యాటింగ్ చేస్తుంటే మంత్రి రోజా కీపింగ్ చేసింది. అయితే ఇక్కడే ఓ తమాషా జరిగింది. మంత్రి రోజాకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్రికెట్ పాఠాలు చెప్పడం ఆసక్తికరంగా మారింది.
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వైఎస్ జగన్ తన కేబినెట్ మంత్రి రోజాకు క్రికెట్ పాఠాలు నేర్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం `ఆడుదాం ఆంధ్ర` కార్యక్రమ ప్రారంభోత్సవం జరిగింది. ఇందులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, రాష్ట్ర క్రీడల మంత్రి రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రికెట్ ఆడిన జగన్ మంత్రి రోజాతో కూడా ఆడించారు. బ్యాట్ పట్టించి ఎలా బ్యాటింగ్ చేయాలో నేర్పించారు.
`ఆడుదాం ఆంధ్ర` కార్యక్రమంలో రోజా మాట్లాడిన అనంతరం ఆమెని బ్యాటింగ్ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆహ్వానించారు. అయితే క్రికెట్ ఆడటం ఎలాగో తెలియని రోజా బ్యాట్ పట్టుకోవడానికి చాలా ఇబ్బందిపడ్డారు. అది గమనించిన వైఎస్ జగన్ స్వయంగా ఆమె దగ్గరికి వెళ్లి బ్యాటింగ్ ఎలా చేయాలో నేర్పించారు. క్రీజ్లో బ్య్ ఎక్కడ ఉంచాలి, ఎలా బ్యాట్ చేయాలి వంటి మెలకువలు నేర్చించారు. జగన్ నేర్పించింది ఒంటబట్టించుకున్న రోజా బ్యాంటింగ్ చేసి తొలి బంతికే బిగ్ షాట్ కొట్టేసింది.
అది చూసిన వైఎస్ జగన్ చప్పట్లుతో ఆమెను మరింతగా ప్రోత్సహించారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన వైఎస్ జగన్ బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డి బౌలింగ్లో భారీ షాట్లు ఆడి అలరించడం విశేషం. వైఎస్ జగన్ మంత్రి రోజాకు బ్యాటింగ్ పాఠాలు నేర్సిన వీడియోపై ప్రస్తుతం సెటైర్లు పేలుతున్నాయి. `ఆడుదాం ఆంధ్ర సిత్రాలు` అంటూ కామెంట్లు చేస్తున్నారు.