Aditi Rao Hydari : అదితి రావు హైదరీ అనగానే తెలుగులో సమ్మోహనం సినిమా గుర్తుకు వస్తుంది. ఆ మూవీలో ఆమె నటన అంతలా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం అదితీ రావు హైదరీ నటించిన ఓ వెబ్ సిరీస్ ఓటీటీలో విడుదల కాగా.. ఆ షూటింగ్ సమయంలో ఎంతలా కష్టపడింది చెప్పుకొచ్చింది. హరామండి ది డైమండ్ బజార్ మూవీలో అదితి రావు కీలక రోల్ చేస్తుంది.
ఈ వెబ్ సిరీస్ 8 ఎపిసోడ్ లలో వస్తుంది. హీరామండి అనే ప్రాంతంలో ఉన్న వేశ్యల జీవితాల్లో స్వాతంత్య్రం కంటే ముందు జరిగిన విషయాలను దర్శకులు సంజయ్ లాల్ బన్సాలీ అద్భుతంగా తెరకెక్కించాడు. ముఖ్యంగా ఆయన ఈ వెబ్ సిరీస్ ను ప్రత్యేకంగా రూపొందించాలని నిర్ణయించాడు. అందుకే హిరో, హిరోయిన్ల పట్ల కఠినంగా వ్యవహరించాడు.
ఈ వెబ్ సిరీస్ సమయంలో డైరెక్టర్ సంజయ్ లాల్ బన్సాలీ అదితిని ఒక రోజంతా ఇబ్బంది పెట్టాడట. సినిమా షూటింగ్ కోసం ఒక రోజు మొత్తం అన్నం తినొద్దని, ఆకలితో అలమటించాలని చెప్పాడట. దీంతో అదితి చాలా ఇబ్బంది పడిందట. అయితే ఆయన అది కావాలని చేయలేదంటా.. హీరామండి ది వెబ్ సిరీస్ లో ఒక కీలక సన్నివేశం సందర్భంగా.. కీలక సీన్లు తీసే విషయంలో అదితితో ఎక్స్ ప్రెషన్లు పలికించడం కోసం ఇలా చేశారని తెలుస్తోంది.
ఆకలితో పస్తులుండి ఆ సీన్లు చేయడం వల్ల సీన్ పండిందని ఈ విషయంలో తప్పా ఆయన లెజెండరీ డైరెక్టర్ అని అదితి తేల్చి చెప్పింది. ఈ వెబ్ సిరీస్ లో మనీషా కోయిరాలా, రిచా చద్దా, సోనాక్షి సిన్హా, షర్మిన్ సింగ్, సంజీదా షేక్ లతో పాటు ఫర్దీన్ ఖాన్ తదితర ముఖ్య నటీనటులు నటించారు. దీంతో పాటు సంజయ్ లీలా బన్సాలీ నటించడంతో ఎక్కువగా ఈ వెబ్ సిరీస్ పై అంచనాలు పెరిగిపోయాయి. కాబట్టి సంజయ్ లీలా బన్సాలీ, అదితి రావు హైదరీ కాంబినేషన్ లో రాబోతున్న ఈ వెబ్ సిరీస్ మరీ ప్రేక్షకుల అంచనాలను చేరుకుంటుందా లేదా చూడాలి.