JAISW News Telugu

Chandra Shekhar Rao : అదిరిందయ్యా ‘చంద్ర’శేఖర్ రావు.. ఇంటర్యూనా? వన్ మ్యాన్ షోనా?

Chandra Shekhar Rao

Chandra Shekhar Rao

Chandra Shekhar Rao : దాదాపు పదేళ్ల తర్వాత తెలంగాణ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు టీవీ డిబేట్ లో పాల్గొన్నారు. దీనిపై భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కు చెందిన నాయకులు నానా హడావిడి చేశారు. చెన్నై-లక్నో మధ్య ఐపీఎల్ మ్యాచ్ ఉన్నప్పటికీ కేసీఆర్ ఇంటర్వ్యూనే అందరూ చూస్తారని పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రచారాన్ని ఊదరగొట్టారు. కొన్ని ఊళ్లల్లో డిజిటల్ ప్రచార వాహనాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నట్లు హంగామా క్రియేట్ చేశారు. ఆ డిబేట్ మొత్తం చూసినవారు ఒకటే మాట అన్నారు.

కేసీఆర్ చెప్పే విషయాలు ప్రెస్ మీట్ పెట్టి చెబితే సరిపోయేది.. టీవీ స్టూడియో వరకు వెళ్లడం ఎందుకు దండగ అని ప్రచారం చేసిన బీఆర్ఎస్ నేతలను తిట్టిపోశారు. కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టుంటే అన్ని టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం అయ్యేది. కావల్సినంత ప్రచారం కూడా వచ్చేది. డిబేట్ లో జర్నలిస్టు ప్రశ్నలు అడిగితే ప్రముఖులు సమాధానం చెబుతారు. కానీ కేసీఆర్ డిబేట్ లో అంతా రివర్స్ లో జరిగింది. కేసీఆర్ ను ఇంటర్వ్యూ చేసే రజనీకాంత్ ఏమీ అడగలేదు. కేవలం తాను చెప్పాలనుకున్నది మాత్రమే కేసీఆర్ చెప్పారు. దానికి కంటిన్యుటీ ఉండేలా రజనీ ప్రశ్నలు అడిగారు.

అసలు రజనీ ప్రశ్నలు అడిగేంత అవకాశం కూడా కేసీఆర్ ఇవ్వలేదని  డిబేట్ చూసిన వారు చెబుతున్నారు. చూసిన వారందరికీ అది ఒక ప్రసంగమని అర్థమైంది. కొత్త పాయింట్లు ఏమీ మాట్లాడలేదు. ఇంటర్వ్యూ అన్నారు.. కానీ ఇంటర్వ్యూ కాదు.. అలా అని డిబేట్ కాదు.. అలా అని ప్రెస్ మీట్ కాదు.. అదే ఏమిటనేది ఆ కేసీఆర్ కు మాత్రమే  తెలియాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఏదేమైనా ఏపీలో వైఎస్ జగన్ గెలవాలని కేసీఆర్ కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నారు.. రేపు చంద్రబాబు అధికారంలోకి వస్తే కష్టమవుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. అధికారం చేతుల్లో ఉన్న సమయంలో వీరిని ఎలా విధంగా వేధించాననే విషయంలో కేసీఆర్ కు స్పష్టత ఉంది, తనను కూడా అలాగే వేధిస్తారని అనుమానంలో కేసీఆర్ ఉన్నారంటున్నారు. తెలంగాణలో రేవంత్ ఇంతవరకు ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదు. కేవలం కేసీఆర్ అపోహే అంటున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు.

Exit mobile version