JAISW News Telugu

Adipurush Vs HanuMan : 500 కోట్ల బడ్జెట్ తో తీసిన ‘ఆదిపురుష్’ డిజాస్టర్ అవ్వడానికి..20 కోట్ల బడ్జెట్ సినిమా ‘హనుమాన్’ హిట్ అవ్వడానికి కారణం ఇదే!

Adipurush vs HanuMan

Adipurush vs HanuMan

Adipurush vs HanuMan : అద్భుతమైన సినిమాలు తియ్యడానికి కావాల్సింది భారీ బడ్జెట్లు, పెద్ద పాన్ ఇండియన్ స్టార్స్ కాదు. కావాల్సింది అద్భుతమైన ప్రతిభ, సృజనాత్మకత. పెద్ద హీరోలు ఉన్నంత మాత్రాన ఎంత చెత్త సినిమా తీసినా జనాలు చూస్తారని రూల్ లేదు. అందుకు ఉదాహరణలు గతం లో మనం ఎన్నో చూసాము. ఇప్పుడు మళ్ళీ అది హనుమాన్ విషయం లో చూస్తున్నాము. ఈ సినిమా డైరెక్టర్ కి కేవలం మూడు నుండి నాలుగు సినిమాలు తీసిన అనుభవం మాత్రమే ఉంది.

కానీ టాలెంట్ మాత్రం ఎవ్వరూ ఊహించనంత ఉంది. ఎంత టాలెంట్ అంటే 20 కోట్ల రూపాయిల బడ్జెట్ తో 500 కోట్ల రూపాయలతో సమానమైన ఔట్పుట్ ని రాబట్టేంత టాలెంట్ అన్నమాట. కొన్ని సన్నివేశాలకు థియేటర్స్ లో ఉన్న ఆడియన్స్ తమకి తెలియకుండానే పైకి లేచి చొక్కాలు చింపుకునే రేంజ్ లో తీసాడు. ఈ సంక్రాంతి కి వచ్చిన పెద్ద హీరోల సినిమాలను పక్కకి నెట్టి సంక్రాంతి విజేతగా నిలిచాడు.

ఈ సినిమా థియేట్రికల్ రన్ చూస్తూ ఉంటే ఓవర్సీస్ లో నాలుగు మిలియన్ డాలర్ల వసూళ్లు వస్తాయని ట్రేడ్ పండితులు బలమైన నమ్మకం తో ఉన్నారు. అంతే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకి తెలుగు వెర్షన్ నుండి వంద కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు కూడా వస్తాయని చెప్తున్నారు. ఒక చిన్న సినిమాతోనే ఇన్ని అద్భుతాలు చేస్తే, ప్రభాస్ లాంటి పాన్ ఇండియన్ సూపర్ స్టార్ తో ఎన్ని అద్భుతాలు చెయ్యొచ్చో మీరే ఊహించుకోండి. కానీ అలాంటి బంగారం లాంటి అవకాశం ని నాశనం చేసాడు బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్. అతని దర్శకత్వం లో గత ఏడాది విడుదలైన ‘ఆదిపురుష్’ చిత్రం ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం 500 కోట్ల రూపాయిలు ఖర్చు పెట్టారట, విజువల్ ఎఫెక్ట్స్ క్వాలిటీ చూస్తే 20 కోట్ల రూపాయిల రేంజ్ లో ఉన్నట్టుగా ప్రతీ ఒక్కరికీ అనిపించింది.

అంతే కాదు శ్రీ రాముడి ని అపహాస్యం చేస్తూ, రామాయణం ని వక్రీకరించి అబాసుపాలు చేశారు. కానీ ‘హనుమాన్’ చిత్రం లో మాత్రం ఆంజనేయ స్వామి శక్తులను ఎంతో అద్భుతంగా చూపించాడు. ఈ సినిమా చూసిన తర్వాత ప్రశాంత్ వర్మ రామాయణం ని ఎంతలా అధ్యయనం చేసి తీసాడో అర్థం అవుతుంది. అలాగే ‘ఆదిపురుష్’ సినిమా చూస్తే డైరెక్టర్ ఓం రౌత్ కి అసలు రామాయణం అంటే ఏంటో తెలీదు అనిపిస్తాది. రెండిటి మధ్య అంత వ్యత్యాసం ఉంది కాబట్టే, ఆడియన్స్ కూడా ఫలితాలు అలా ఇచ్చారు.

Exit mobile version