Adikesava Movie : ఆదికేశవ మూవీ రివ్యూ అండ్ రేటింగ్..!

Adikesava Movie

Adikesava Movie

Adikesava Movie : మెగా హీరోల్లో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఒకరు. ఈయన ఎంట్రీ ఇచ్చిన సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకుని మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే ఉప్పెన సినిమా తర్వాత ఇతడు రెండు సినిమాలు చేయగా రెండు కూడా ప్లాప్ అయ్యాయి.. ఇక ఇప్పుడు ఈయన తన 4వ సినిమా ఆది కేశవ చేయగా ఈ సినిమా మీదనే భారీ అంచనాలు పెట్టుకున్నాడు.

వైష్ణవ్ తేజ్ ఇప్పుడు ”ఆదికేశవ” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రోజు నవంబర్ 24న ఈ సినిమా రిలీజ్ అయ్యింది.. మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను కొత్త డైరెక్టర్ ఎన్ శ్రీకాంత్ రెడ్డి డైరెక్ట్ చేసాడు.. మరి ఈ సినిమా వైష్ణవ్ తేజ్ ఖాతాలో హిట్ నో లేదంటే ప్లాప్ అయ్యిందో రివ్యూ తెలుసుకుందాం..

నటీనటులు :

వైష్ణవ్ తేజ్

శ్రీలీల

అపర్ణ దాస్

జోజు జార్జ్

రాధిక

సుదర్శన్

డైరెక్టర్ : ఎన్ శ్రీకాంత్ రెడ్డి

బ్యానర్ : సితార ఎంటర్టైన్మెంట్స్

కథ : 

పని పాట లేకుండా ఎంజాయ్ చేస్తూ బలాదూర్ తిరిగే ఒక కుర్రాడికి శ్రీలీల పరిచయం అవుతుంది.. అప్పటి నుండి ఆమెతో తిరుగుతూ లవ్ చేస్తున్న అంటూ వెంటపడేవాడు.. అయితే హీరోయిన్ వాళ్ళ నాన్న పెద్ద బిజినెస్ మ్యాన్ కావడంతో ఇతడిని రిజక్ట్ చేస్తాడు.. ఇదిలా ఉండగా ఒక వ్యక్తి ఒక ఊరిలో మైనింగ్ చేస్తూ భూములు మొత్తాన్ని తవ్వుతూ ఉంటాడు.. ఈ క్రమంలో దేవాలయం కూడా తవ్వాలని చూడగా ఊరి జనం ఒప్పుకోరు. అయినా అతడు ఆ పని చేయాలని అనుకోవడంతో వైష్ణవ్ ఎదురు నిలబడగా అక్కడి నుండి అసలు కథ స్టార్ట్ అవుతుంది..

విశ్లేషణ : 

డైరెక్టర్ కొత్త వాడు అయినా కథ ఎంచుకున్న తీరు బాగుంది. కానీ కొత్తదనం చూపించకుండా రొటీన్ గా చెప్పే ప్రయత్నం చేసాడు.. రొటీన్ గా సాగుతున్న పేక్షకులకు బోర్ కొట్టకుండా కామెడీ, లవ్ ట్రాక్ తో ముందుకు నడిపించాడు. కొన్ని సీన్స్ లో ఎమోషన్ ను డైరెక్టర్ క్యారీ చేయలేక పోయాడు. మరింత ఎఫర్ట్ పెట్టి ఉంటే సినిమా నెక్స్ట్ లెవల్లో ఉండేది..

నటీనటుల పర్ఫార్మెన్స్ : 

ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ తన రోల్ కు వంద శాతం న్యాయం చేసాడు.. శ్రీలీల కూడా ప్రేక్షకులను ఏ మాత్రం డిజప్పాయింట్ చేయలేదు. డీసెంట్ పాత్రతో ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. వైష్ణవ్, శ్రీలీల జోడీ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా వీరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. అపర్ణ దాస్ తన పాత్ర మేర బాగా చేసింది.. విలన్ గా నటించిన జోజు జార్జ్ కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ కనబర్చి ఆకట్టుకున్నాడు. సీనియర్ హీరోయిన్ రాధిక రోల్, అలాగే సుదర్శన్ కామెడీ కూడా హైలెట్ గా నిలిచాయి.

టెక్నీకల్ పర్ఫార్మెన్స్ : 

ఈ సినిమా టెక్నీకల్ టీమ్ కూడా బాగానే ఆకట్టుకుంది.. ముఖ్యంగా మ్యూజిక్ పరంగా జివి ప్రకాష్ సాంగ్స్ పర్వాలేదు అనిపించినా న్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయేలా ఉంది.. సినిమాటోగ్రాఫర్ కూడా విజువల్స్ అద్భుతంగా చూపించాడు.. ఎడిటర్ కట్ చేసిన తీరు సినిమా బోర్ లేకుండా చేయటంలో సక్సెస్ అయ్యింది.. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ : 

కథ

హీరో, హీరోయిన్ కెమిస్ట్రీ

బీజీఎమ్

యాక్షన్ సన్నివేశాలు

మైనస్ పాయింట్స్ : 

కొన్ని లాగ్ సీన్స్

రొటీన్ స్క్రీన్ ప్లే

రేటింగ్ : 2.75/5

TAGS