అదే దర్శకుడి నుంచి మరో సినిమా వస్తుండడం, హీరో సూపర్ స్టార్ రజినీకాంత్ కావడంతో అమెజాన్ ప్రైమ్ రూ. 120 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే దీపావళి కానుకగా అక్టోబర్ 31 న విడుదల చేస్తారని అంతా ఊహించారు. కానీ, నవంబర్ 7 న విడుదల చేయబోతున్నారని తెలుస్తున్నది. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానున్నది. ఓటీటీ వెర్షన్ లో కొన్ని అదనపు సన్నివేశాలను జత చేయబోతున్నట్లు సమాచారం. ప్రతీ సినిమాకి ఎడిటింగ్ సమయంలో నిడివి తగ్గించేందుకు కొన్ని సన్నివేశాలు ట్రిమ్ అవుతుంటాయి. ఇందులోనూ అదే జరిగింది. రానా, రజనీకాంత్ కాంబినేషన్ లో వచ్చే ఒక సన్నివేశంతో పాటు, మరో రెండు యాక్షన్ సన్నివేశాలను సినిమాలో జత చేయబోతున్నారని టాక్. .
ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసిందని ట్రేడ్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి తెలుగు, తమిళ భాషలకు కలిపి దాదాపు 244 కోట్ల గ్రాస్ వచ్చింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే కచ్చితంగా రూ. 320 కోట్ల గ్రాస్ ని రాబట్టాల్సిందే. కానీ అది సాధ్యమయ్యేలా లేదు. ఇక తెలుగు వెర్షన్ ను రూ.17 కోట్లకు అమ్ముడైంది. కానీ క్లోజింగ్ కలెక్షన్లు కేవలం 11 కోట్ల షేర్ కే పరిమితమైంది. రజినీ లోకేష్ కనకరాజ్ తో చేస్తున్న ‘కూలీ’ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ సినిమా విడుదల కానుంది.