Kodela Siva Prasad : ఆదర్శ మూర్తి కోడెల.. ఆయన నడక నేటి తరానికి స్ఫూర్తి..
Kodela Siva Prasad : పెద్దలు, మహానుభావుల నడక ఎప్పటికీ యంగ్ జనరేషన్ కు స్ఫూర్తిగా నిలుస్తుంది. కొందరు నాయకుల జీవిత పయనం కూడా చదువుకొని అనుసరించాల్సిందే. అప్పడే సమాజం, సంఘం గొప్పదిగా, ఆదర్శంగా తయారవుతుంది.
ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు అందిరికీ సుపరిచితమైన వ్యక్తే. ఆయన ఎప్పటికీ తన ఒంటిపై శాలువాను కప్పుకునేవారు. అవి కూడా ఎవరైనా ప్రముఖులు ఆయనను సన్మానించినవి. అదేంటి పంతులు గారూ ఎప్పడూ శాలువా కప్పుకుంటున్నారు అంటే ‘లోపల చొక్కా చినిగిందిరా నాయనా ఆ బొక్కలు బయటకు కనిపించవద్దని’ అన్నారట. నేటి తరానికి అది ఒక పిసినారి చర్యగా కనిపించవచ్చు. కానీ పాలించేవాడు ఆశించవద్దని ఉన్నదానిలో ఎలా తృప్తి పొందాలో టంగుటూరి గారిని చూస్తే అర్థం అవుతుంది.
గతంలో ఏపీ స్పీకర్ గా వ్యవహరించిన కోడెల శివప్రసాద్ ఏపీతో పాటు తెలంగాణ ప్రజలకు సుపరిచితమైన నేత. పొదుపుగా జీవించడం ఆయనకే చెల్లింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయాక. హైదరాబాద్ లో తన కార్యాలయంలో ఉన్న ప్రతీ చిన్న వస్తువు లిస్ట్ గా రాసి అన్నింటినీ జాగ్రత్తగా తెప్పించుకున్నారు. అదో సెంటిమెంట్ అంటే కాదు.. కొత్త రాష్ట్రం పొదుపు అనేది చాలా ముఖ్యం అని ఆయన భావించారు. తను ఉండాల్సి వచ్చిన మూడు నుంచి నాలుగు చోట్ల కూడా సొంత ఖర్చుతో కొంచెం ఫర్నీచర్ తో తన ఇంట్లోనే ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నారు.
విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కు మొదటి స్పీకర్ గా ఉన్న కోడెల శివప్రసాద్ చాలా జాగ్రత్త పరుడు. వస్తువుల అరుగుదల గురించి కూడా ప్రభుత్వానికి లేఖ రాశారంటే ఆయన జాగ్రత్త, గొప్పతనం అర్థం చేసుకోవచ్చు. ఆయన పయనం నేటి యువతకు స్ఫూర్తి. ఆయన ఆలోచనలు నేడు యువత ఒడిసి పట్టుకోవాలి.