Rahul Gandhi : అదానీని అరెస్టు చేయాలి : రాహుల్ గాంధీ
Rahul Gandhi : గౌతమ్ అదానీపై వస్తున్న లంచం ఆరోపణలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ అంశంపై జేపీసీ వేయడంతో పాటు అదానీని వెంటనే అరెస్టు చేయాలన్నారు. అలాగే ఈ కేసులో అదానీని కాపాడుతున్న సెబీ చీఫ్ మాధవిని విచారించాలని రాహుల్ డిమాండ్ చేశారు. అదానీ విషయాన్ని పార్లమెంటులో లేవనెత్తుతామన్నారు. 2 వేల కోట్ల స్కామ్ కు పాల్పడినా, అదానీని ఎవరూ అరెస్టు చేయలేరు, నేను గ్యారంటీ ఇస్తున్నా.. ఎందుకంటే ఆయనను భారత ప్రభుత్వం కాపాడుతోందని రాహుల్ అన్నారు.
అదానీ 20 ఏళ్లలో.. 2 బిలియన్ డాలర్ల లాభం పొందగల సౌరశక్తి సరఫరా ఒప్పందాలను పొందేందుకు భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 2 వేల కోట్లు లంచాలు చెల్లించేందుకు అంగీకరించారని అమెరికాలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో యూఎస్ లంచం నిరోధక చట్టం ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ ను ఉల్లంఘించినట్లు వెల్లడించారు.