Actress : చావు తప్పదని తెలిసి కోట్ల ఆస్తిని దానం చేసిన నటి..!
Actress : సినీ ఇండస్ర్టీలో రాణించాలని, తెరపై వెలిగిపోవాలని ఎంతో మంది కలలు కంటూ ఉంటారు. కానీ ఆ అదృష్టం అందరికీ దక్కదు. కష్టపడే తత్వం ఎంత ఉన్నా, సినీ ఇండస్ర్టీలో రాణించాలంటే కొంచమైనా అదృష్టం కలిసి రావాలి. అలా కలిసి వచ్చిన వారు ఏళ్ల పాటు తెరపైన వెలిగిపోతుంటారు. కొందరు తమ మరణానంతరం తమ పాత్రలు, సినిమాలతో ఎప్పటికీ ప్రేక్షకులను మదిలో ఎప్పటికీ నిలిచిపోతుంటారు.
అయితే సినిమా రంగంలో ఒక దశలో రాణించినా, ఏదో ఒక సమయంలో వేసిన తప్పటడుగులు వారి జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంటాయి. అప్పటి వరకు స్టార్ గా వెలుగొందిన వారు సైతం దిక్కులేని పరిస్థితిలో కూరుకుపోతుంటారు. వెంట ఉండి తమ అవసరాలు తీర్చుకున్న వారే ఆ తర్వాత దూరమవుతుంటారు. ఈ రంగుల ప్రపంచంలో అవన్నీ సాధారణమైపోయాయి. నాటి మహానటి సావిత్రి నుంచి మొన్నటి ఆర్తి అగర్వాల్ వరకు ఎంతో మంది తెలిసిన వారి చేతిలోనే దెబ్బతిన్న వారే.
ఎక్కువగా నటీమణులు జీవితాల్లో ఇవి ఎక్కువగా కనిపించాయి. కొందరు స్వయంకృతాపారాధం వలన దీనస్థితికి చేరుకోగా, మరికొందరు విధి ఆడే వింత నాటకంతో ఇబ్బందులు ఎదుర్కోన్న వారు సైతం ఉన్నారు. తమిళ హాస్యనటుడు కృష్ణమూర్తి కర్ణాటక శాస్త్రీయ సంగీత గాయని ఎంఎల్ వసంతకుమారి దంపతుల కూతరు శ్రీవిద్య. ఆమె పుట్టిన ఏడాదికే తండ్రికి పక్షవాతం రావడంతో నటనకు దూరం కావాల్సి వచ్చింది. కుటుంబ బాధ్యత తల్లి పైన పడింది.
కచేరీలతో వచ్చే డబ్బు సర్దుకుంటూ వచ్చింది శ్రీవిద్య కుటుంబం. ఆర్థిక ఇబ్బందులతో జీవితాన్ని నెట్టుకొచ్చారు. శ్రీవిద్య 14 ఏళ్ల వయసులో తమిళ సినిమాతో కోలీవుడ్ కు పరిచయమయ్యారు. తొలి సినిమాలో శివాజీ గణేషన్ హీరో. పేదరాశి పెద్దమ్మ కథ ఆమె నటించిన తొలి తెలుగు సినిమా. దాసరి నారాయణరావు తన సినిమాల్లో శ్రీవిద్యకు ఎక్కువగా అవకాశాలు ఇచ్చారు. కే బాలచందర్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన అపూర్వ రాగంగల్ సినిమాలో కమల్ హాసన్, రజనీకాంత్ నటించారు. ఈ సినిమాను దాసరి నారాయణరావు తూర్పు -పడమర పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. కమలహాసన్- శ్రీవిద్య ఎక్కువ సినిమాల్లో కలిసి నటించారు. ఈ క్రమంలో ఇద్దరు ప్రేమలో పడ్డారు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇరు కుటుంబాలు ఒప్పుకున్నా పెళ్లి మాత్రం చేసుకోలేకపోయారు. దీనికి సంబంధించిన కారణాలు ఇప్పటికీ తెలియవు.
అనంతరం శ్రీవిద్య.. క్రిస్టియన్ మతానికి చెందిన థామస్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. శ్రీ విద్యది బ్రాహ్మణ కుటుంబం. వీరి వివాహానికి తల్లిదండ్రులు అంగీకరించారు. అయినా సరే ఆమె పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. శ్రీవిద్య సినిమాల్లో బిజీగా ఉండి ఎంతో కూడ బెట్టారు. కానీ ఆమె భర్త థామస్ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. వేధింపులు తాళలేక 1980లో శ్రీ విద్య భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఆ తర్వాత ఆమె నటిగా తన కెరీర్ కొనసాగించింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో విజయవంతమైన చిత్రాలు చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. కాగా 2003లో ఆమె అనారోగ్యానికి గురయ్యారు. రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణకావడంతో మూడేళ్లపాటు క్యాన్సర్ కి చికిత్స తీసుకున్నారు. కానీ శ్రీవిద్య ఆరోగ్యం రోజురోజుకూ క్షీణించడంతో పరిస్థితి విషమించగా 2006 అక్టోబర్ 19న చనిపోయాడు. అయితే తాను ఎలాగూ చనిపోతానని తెలిసి కోట్ల ఆస్తిని ఇతరులకు పంచేసింది.