Actress Tamannaah : బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి తమన్నా

Actress Tamannaah
Actress Tamannaah : మనీలాండరింగ్ కేసులో నటి తమన్నా గురువారం గౌహతిలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. మహాదేవ్ బెట్టింగ్ యాప్ మనీలాండరింగ్ కేసులో నటి తమన్నా భాటియాను ప్రశ్నించినట్లు ఈడీ అధికారులు తెలిపారు. యాప్ ద్వారా బిట్ కాయిన్, క్రిప్టో కరెన్సీలను మైనింగ్ సాకుతో చాలామంది ఇన్వెస్టర్లను మోసం చేసినట్లు ఆరోపణలున్నాయి. అందులో తమన్నాపై ఎలాంటి నేరారోపణలు లేవు. కానీ, ఈడీ గౌహతి కార్యాలయంలో ఆమెను 8 గంటలు విచారించింది. ఈ సమయంలో ఆమె తల్లి కూడా తమన్నాతో ఈడీ కార్యాలయానికి వచ్చింది. ప్రస్తుతం ఆమె నుంచి వాంగ్మూలం తీసుకున్నట్లు సమాచారం.
తమన్నా ఫెయిర్ ప్లే బెట్టింగ్ యాప్ లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ లను చూడడాన్ని ప్రచారం చేసింది. ఈ నేపథ్యంలో ఆమెను ఈరోజు మధ్యాహ్నం నుంచి దాదాపు ఐదు గంటల పాటు ఈడీ విచారించింది. అంతేకాదు, ఇటీవల ‘స్త్రీ-2’’ చిత్రంతో తతమన్నా వార్తల్లో నిలిచింది. అందులో ఆమె ‘ఆజ్ కీ రాత్’ పాటతో ఫుల్ ఫేమస్ అయ్యారు.