Actress Swomya : ఆ దర్శకుడి వల్లే నా లైఫ్ పోయింది..? ఆ విషయంలో బానిసను చేశాడు..

Actress Swomya
Actress Swomya : జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ తో ‘మీ-టూ’కు అందరు నటీమణులు చేతులు కలుపుతున్నారు. ఇప్పుడు మళయాల చిత్ర పరిశ్రమ మొత్తం మీ-టూ ఆవహించింది. అత్యాచారాలు, లైంగిక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందులో భాగంగానే తమిళ నటి సౌమ్య తన కెరీర్ ప్రారంభంలో తనకు ఎదురైన అనుభవాలను బయటపెట్టింది.
నటి సౌమ్య 90వ దశకంలో మూడు మలయాళ చిత్రాలు, ఒక తమిళ చిత్రంలో నటించింది. ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సౌమ్య మాట్లాడుతూ దర్శకుడు తనను సెక్స్ బానిసగా తీర్చిదిద్దాడని, ఆమె ఆయన పేరును భయటపెట్టేందుకు ఇష్టపడలేదు. తనకు 18 ఏళ్ల వయసున్నప్పుడు దర్శకుడు, ఆయన భార్య తనను సంప్రదించారని సౌమ్య తెలిపింది.
మొదట్లో తనను కూతురిగా ఆప్యాయంగా పిలిచేవారని, ఆ తర్వాత అదే వ్యక్తి తనతో బిడ్డ కావాలని చెప్పాడని సౌమ్య తెలిపింది. కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీస్ బృందానికి ఆ వ్యక్తి ఎవరో చెప్పాలని సౌమ్య భావిస్తోంది. తన స్క్రీన్ టెస్ట్ కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేశామని చెప్పి తన కుటుంబం తనను నటించేందుకు బలవంతం చేసిందని ఆమె తెలిపింది.
సౌమ్య మాట్లాడుతూ.. ‘దర్శకుడు ఆయన భార్య మొదట్లో మంచి ఆహారం, మిల్క్ షేక్స్ ఇస్తూ బాగా చూసుకున్నారు. ఒక రోజు, అతని భార్య లేనప్పుడు, ఈ వ్యక్తి నన్ను ముద్దు పెట్టుకున్నాడు. నేను పూర్తిగా స్తంభించిపోయాను. నేను సిగ్గుపడడంతో నా స్నేహితులకు చెప్పలేకపోయాను. అందుకే డాన్స్ రిహార్సల్స్ కు వెళ్లడం, స్టెప్ బై స్టెప్స్ వేయడంతో ఈ వ్యక్తి నా బాడీని పూర్తిగా తనకి అనుకూలంగా వాడుకున్నాడు. ఒకానొక దశలో బలవంతంగా నాపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇది నేను కాలేజీలో చదువుతున్నప్పుడు దాదాపు ఒక సంవత్సరం పాటు కొనసాగింది.’
గత నెలలో జస్టిస్ హేమ కమిటీ నివేదిక బయటపడ్డప్పటి నుంచి సీనియర్ మలయాళ నటులు, సినీ దర్శకులపై అత్యాచారం, దాడి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.