Actress Srivani : ఈ మధ్య సెలబ్రెటీలు యూ ట్యూబ్ ద్వారా తమ రెమ్యునరేషన్ కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. సీరియల్ నటుల నుంచి సినిమాలో నటించే వారి వరకు సోషల్ మీడియా సంపాదనను వదులుకోవడం లేదు. సైడ్ ఇన్ కం కోసం సోషల్ మీడియా వైపు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇలా ప్రతీ ఒక్కరూ యూ ట్యూబ్ ఛానెల్ పెట్టి వారి వీడియోలు, పోస్ట్ లను అందులో పెడుతున్నారు. నటులు కాబట్టి భారీగానే వ్యూవ్స్ వస్తున్నాయి. దీంతో సైడ్ ఇన్ కం మేయిన్ ఇన్ కంను దాటి పోతుంది. బుల్లితెర నటి శ్రీవాణి సైడ్ ఇన్ కంపై పడిందట.
సీరియల్స్ అభిమానులకు శ్రీవాణి విక్రమ్ గురించి పరిచయం అవసరం లేదు. దంపతులు ఇద్దరూ బుల్లితెర నటులే. శ్రీవాణి సీరియల్స్ లో కొనసాగుతున్నా.. విక్రమ్ ‘మీ కడుపు నిడా’ అనే హోటల్ రన్ చేస్తున్నారట. వీరికి రాజనందిని అనే కుమార్తె కూడా ఉంది. ఇలా, సీరియల్స్ లో బిజీగా ఉన్న శ్రీవాణి యూ ట్యూబ్ ఛానెల్ నడిపిస్తోంది. ఈమె తన సీరియల్స్ తో పాటు రెస్టారెంట్ బాధ్యతలను కూడా చూసుకుంటుంది. ఓ ఇంటర్వ్యూలో ఆమె కొన్ని విషయాలు వెల్లడించింది. ఇప్పుడు ఈ కామెంట్లు వైరల్ గా మారాయి.
‘మాది మధ్య తరగతి ఫ్యామిలి. ఉన్నదాంట్లోనే తృప్తిగా ఉంటాం. ఎలాంటి ఆడంబరాలకు పోయే వారం కాదు’ అని చెప్పారు శ్రీవాణి. ఒక యూ ట్యూబ్ ఛానల్ ప్రారంభించారు శ్రీవాణి దంపతులు. దీంతో అభిమానులకు మరింత దగ్గరవుతున్నారట. ఆ యూ ట్యూబ్ ఛానల్ ద్వారా ఎంత సంపాదిస్తున్నారని యాంకర్ ప్రశ్నించగా.. శ్రీవాణి షాకింగ్ ఆన్సర్ చెప్పింది. యూ ట్యూబ్ లో పోస్ట్ చేసిన వీడియోలు.. వాటికి వచ్చిన లైకులతో రూ. 30 లక్షల వరకు రెమ్యునరేషన్ వచ్చిందని తెలిపింది.
రీసెంట్ గా ఆదిరెడ్డి యూ ట్యూబ్ లోని తన ఛానల్ ద్వారా నెలకు రూ. 39 లక్షల రెమ్యూనరేషన్ వచ్చిందని చెప్పాడు. శ్రీవాణి దంపతులు కూడా తన కుమార్తె సారీ ఫంక్షన్ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోకు సంబంధించి ఆ నెల రూ. 30 లక్షల వరకు అమౌంట్ వచ్చిందని తెలిపింది. ఆ డబ్బుతో ఓ కొత్త ఇళ్లు కొనేందుకు అడ్వాన్స్ ఇచ్చారట. దీంతో పాటు గృహ ప్రవేశం సమయంలో తీసుకున్న వీడియోలకు కూడా వ్యూవ్స్ బాగానే వచ్చాయట. దీంతో లక్షల్లో డబ్బులు వచ్చాయని తెలిపింది. వామ్మో శ్రీవాణి యూ ట్యూబ్ ద్వారా ఇంత సంపాదిస్తుందా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.