Actress Sreeleela : శ్రీలీల సోషల్ మీడియా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. అమ్మడు తన సోషల్ మీడియా ఖాతాల్లో ఎలాంటి పిక్ పోస్ట్ చేసినా క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. శ్రీలీల యంగ్ హీరోల నుంచి స్టార్ హీరోలకు ప్రమోట్ కావడంతో క్రేజ్ కూడా అంతకంతకూ రెట్టింపయ్యింది. కన్నడ బ్యూటీ హాట్ అప్పీరియన్స్ కు మొదటి నుంచి దూరంగానే ఉంటుంది. సెగలు పుట్టించే భంగిమలు.. ఫొటోలకు దూరంగా ఉంటున్నా.. స్కిన్ షోను మాత్రం కొనసాగిస్తూనే ఉంటుంది. ఓ మొతాదు డోస్ లో అలరిస్తుంటుంది. వీలైనంత వరకూ కటౌట్ కు తగ్గట్లు డిజైనర్ దుస్తుల్లో హైలైట్ అవుతుంది.
రీసెంట్ గా శ్రీలీల కొన్ని పిక్ లను పోస్ట్ చేసింది. పింక్ రంగు దుస్తుల్లో వావ్ అనిపించే లుక్ తో ఆకట్టుకుంటుంది. ఈ బ్యూటీ స్కిన్ టోన్ పై ఈ రంగు అందంగా కనిపిస్తుంది. సొగసరి స్కిన్ కూడా రోజ్ బ్యూటీ తలపించేలా మేకప్ అయ్యింది. హెయిర్ కు గోల్డ్ టచప్ ఇచ్చింది. చెవుల రింగులు.. అమ్మడి మేకప్ ప్రతీది శ్రీలీల అందాన్ని రెట్టింపు చేశాయి.
ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ సమయంలోనే టాక్ స్టార్ల సరసన చేసిన ఈ అమ్మడి అందం, అభినయం పొగడాలంటే మాటలు చాలవేమో. గార్జియస్ లుక్స్, బ్యూటిఫుల్, లవ్ యూ బంగారం అంటూ ఆమె ఫ్యాన్స్ ఆమెకు ప్రపోజ్ చేస్తున్నారు.
ఇక ఆమె కెరీర్ గురించి చెప్పుకుంటే ఇటీవలే మహేశ్ బాబుతో కలిసి చేసిన ‘గుంటూరు కారం’తో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత ప్రాజెక్టులకు కొంచెం ఆలస్యం అవుతున్నా.. భారీ ప్రాజెక్ట్ తోనే వస్తుందని ఫ్యాన్స్ హోప్స్ పెట్టుకుంటున్నారు. దీంతో కొంత గ్యాప్ ఇచ్చి ఈ గ్యాప్ లో కోలీవుడ్ లోకి వెళ్లి వద్దాం అనుకుంటుందట.
ఇటీవల తమిళ ఇండస్ట్రీ పరిధిలోని ఒక కాలేజీలో జరిగిన ఈవెంట్ కు వెళ్లిన ఈ చిన్నది అక్కడ సినిమాల్లో నటించాలని ఉందని ఓపెన్ అయింది. దీంతో టాలీవుడ్ లో వచ్చిన గ్యాప్ తో కోలివుడ్ కు వెళ్తుందని అందరూ ఒక అంచనాకు వచ్చారు. మరీ ఈ సోయగానికి ఎలాంటి అవకాశాలు వస్తాయో వేచి చూడాలి. చబ్బీ భామలకిచ్చిన ప్రాముఖ్యత ఈ నాజూకు భామలకు లేదనే విమర్శ వినిపిస్తుంది.